Vikarabad Crime: వికారాబాద్ లో దారుణం.. తల్లిని చంపిన కసాయి కొడుకు..
- సయ్యద్ మల్కాపూర్ లో దారుణం..
- తల్లిని చంపిన కన్న కొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad Crime: వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్ లో దారుణం జరిగింది. తల్లిని కన్న కొడుకు చంపిన ఘటన సంచలనంగా మారింది. సయ్యద్ మల్కాపూర్ లో శంకరమ్మ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే తన కొడుకు రోజు తాగి ఇంటి వస్తుండంలో తల్లి కొడుకును మందలించేది. కుటుంబానికి పోషించాల్సిన కొడుకే ఇలా తాగి ఇంటికి వస్తే ఎలా? అంటూ రోదించేది. విసుగు చెందిన కొడుకు తల్లిపై కక్ష పెంచుకున్నాడు. నిన్న (బుధవారం) రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చాడు. దీంతో కొడుకును తల్లి మందలించడంతో ఆవేశం చెందిన కొడుకు ఆమెతో వాదించాడు. గొడవ తాగిన మైకంలో తల్లిని తన్నడంతో ఒక్కసారికిగా తల్లి (శంకరమ్మ) రోడ్డుపై కుప్ప కూలింది. అయినా తల్లిపై కొడుకు కర్కశంగా ప్రవర్తించడంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొడుకు అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లిపోయాడు. అయితే స్థానికులు శంకరమ్మను తట్టిలేపిన స్పందించలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పరిగి పోలీసులు శంకరమ్మ మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. శంకరమ్మ కుటుంబ సభ్యులను, ఇంటిదగ్గర పరిగి పోలీసులు విచారణ జరిపారు. కొడుకును అదుపులో తీసుకుని దర్యాప్తు చేసేందుకు సిద్దమయ్యారు. కొడుకు శంకరమ్మను బలంగా తన్నడంతో ఆమె చనిపోయిందని స్థానికులు పోలీసులకు తెలిపారు.
Largest Link Bridge: యాదాద్రి భక్తులకు ఊరట.. ఆలయ సమీపంలో లింక్ ఫ్లైఓవర్ ఏర్పాటు ..
Also Read
- Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
- CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!