Vikarabad District: దారుణం.. మద్యం మత్తులో తల్లిని చంపిన కొడుకు
- అమ్మ అనంత ఆప్యాయతా సాగరం
- ఆమె లేకుంటే జన్మ లేదు
- అలాంటి త్యాగమూర్తిని ఓ కిరాతక కొడుకు హత్య చేశాడు
- వికారాబాద్ జిల్లా పరిధిలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మ అనంత ఆప్యాయతా సాగరం. తీర్చుకోలేని నిస్వార్థ త్యాగాల రుణం. ఆమె లేకుంటే జన్మ లేదు. జీవితానికి వెలుగే లేదు. మాతృత్వం కోసం ఎన్నో కష్టాలు సహించి బిడ్డల్ని ప్రేమగా పెంచి పెద్ద చేస్తుంది. అందుకే మాతృమూర్తిని మించిన దైవం లేదనేది జగమెరిగిన సత్యం. అంతలా తన పిల్లల కోసం ఆరాటపడుతుంది. కానీ నేటి కాలంలో నవమాసాలు మోసి కనిపెంచిన పిల్లలు ఇవేమి పట్టించుకోకుండా మాతృమూర్తులను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అవసరమైతే వారి ప్రాణాలు తీసేందుకు వెనుకాడటం లేదు.
READ MORE: PCC chief Mahesh Goud: పదేళ్ల బీఆర్‌ఎస్ – ఏడాది మా పాలనపై చర్చకు సిద్ధం.. పీసీసీ చీఫ్ సవాల్
Also Read
తాజాగా వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం జేక్కేపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు మద్యం మత్తులో రోకలి బండతో మోది తల్లిని హత్య చేశాడు. వెంకటప్ప అనే కొడుకు వృద్ధురాలైన చంద్రమ్మతో మద్యం మత్తులో ఇంట్లో గొడవ పడ్డాడు. ఘర్షణ పెరగడంతో ఆగ్రహానికి గురైన కుమారుడు రోకలిబండతో మోది తల్లిని హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి చిన్న కూతురు తిప్పమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
READ MORE: Hyderabad: బర్త్‌డే పార్టీకి పిలిచి.. యువకుడిని కొట్టి చంపిన స్నేహితులు..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!