జూన్ నెలలోనే 9,200 గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అందరూ అన్ని పోస్టులకు పరీక్ష రాసేందుకు వీలుగా ఒక దాని తర్వాత మరోక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నామని వివరించారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో పోరాడి 95…
దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లోని HDFC వినియోగదారుల ఖాతాల్లో ఇంకా జమవుతూనే వున్నాయి కోట్లాది రూపాయలు. తాజాగా మెదక్ కి చెందిన వ్యక్తి బ్యాంకు అకౌంట్ లో లక్ష కాదు.. కోటి కాదు ఏకంగా రూ.9.61 కోట్ల రూపాయలు క్రెడిట్ అయ్యాయి. ఖాతాలో రూ.9.61 కోట్లు జమ అయినట్లు మెసేజ్ రావడంతో… నిజమా? కాదా? అనే అనుమానంతో రూ.4.97 లక్షలను మరో ఖాతాకు బదిలీ చేశాడు నరేందర్. ఇంకేముంది.. తనకున్న క్రెడిట్ కార్డ్ బిల్ రూ.1.42 లక్షల…
మీకో బ్యాంక్ అకౌంట్ వుంది. అందులో వెయ్యో.. పదివేలో.. లక్షో డిపాజిట్ చేస్తుంటారు. అయితే మీ ప్రమేయం లేకుండానే అందులో కోట్ల రూపాయలు పడితే మీ గుండె ఆగిపోతుంది కాసేపు. కొంతమంది బ్యాంక్ కస్టమర్ల ఖాతాల్లో కోట్లరూపాయలు జమచేశారు HDFC బ్యాంక్ సిబ్బంది. అనుకోకుండా.. మీ బ్యాంక్ అకౌంట్లో.. ఒక్కసారిగా ఓ లక్ష రూపాయలు వచ్చి పడితే…ఎలా ఉంటుంది? అదే పది లక్షల రూపాయలు.. 18 కోట్లు అయితే మీ ఆశ్చర్యానికి అంతే వుండదు. సంతోషం ఉబ్బితబ్బిబవుతారు.…
డాక్టర్లను మనం దేవుళ్లతో పోలుస్తాం. ఎందుకంటే.. ప్రాణపాయ స్థితి నుంచి కాపాడుతారు కాబట్టి! ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలొచ్చినా, దాన్ని నయం చేస్తారనే నమ్మకంతో రోగులు వారి వద్దకే వెళ్తారు. అందుకే.. రోగి కోసం డాక్టర్ వెయిట్ చేయొచ్చు గానీ, డాక్టర్ కోసం రోగి వెయిట్ చేయకూడదంటారు. బహుశా కాసేపు వేచి చూసినా, డాక్టర్ వస్తాడన్న నమ్మకమూ రోగుల్ని బ్రతికిస్తుంది. కానీ, ఆ నమ్మకమే ఒమ్మై డాక్టర్లు అందుబాటులోకి రాకపోతే? ఆ రోగి పరిస్థితి ఏంటి? సరిగ్గా…
కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళుతోంది. ఎన్నికలకు మరో ఎడాదిన్నర ఉండటంతో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణ వేడెక్కుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్… దాన్ని మాత్రం ఓట్లుగా మార్చుకోలేకపోతున్నారు. అయితే ఈ సారి మాత్రం తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. దీంతో పాటు పార్టీలో నెలకొన్న అసమ్మతిని తగ్గించేందుకు ఇటీవల కాంగ్రెస్ పెద్దలతో రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. దీంతో పాటు ఇటీవల వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ…
తన చిన్ననాటి స్నేహితుడ్ని ఓ వ్యక్తి దారుణంగా మోసం చేశాడు. స్నేహాన్ని అడ్డం పెట్టుకొని, అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసి మందలించడంతో, చివరికి భార్యని తీసుకొని పరారయ్యాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మంతట్టి గ్రామానికి చెందిన గుడాల పరమేశ్, పావని భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన పిట్టలి విశ్వనాథ్, పరమేశ్ చిన్ననాటి స్నేహితులు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండేవారు.…
వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పదవతరగతి చదువుతున్న విద్యార్ధినిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు. ఆయువతి ఏడు నెలల గర్భవతి కాగా నిన్న శుక్రావారం ఓ ప్రవేట్ ఆసుపత్రిలో మగ శిశువును ప్రశవించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లో వెళితే.. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం జిన్ గుర్తి లోని ఓ .. హై స్కూల్ లో విద్యార్ధిని పదవ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు…
ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడ్డారు. బాలికపై బండరాయితో మోది హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయం 6 గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది మైనర్ బాలిక. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం బాలికను వివస్త్రను చేసి హత్య, అత్యాచారానికి పాల్పడినట్లు…
ఎండ ప్రచండ కిరణాలనుంచి హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగింది. వాతావరణ శాఖ అంచనాలు నిజమయ్యాయి. నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం, తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో ఉన్న అల్పపీడనం తూర్పు-ఈశాన్య దిశగా కదిలి, ఈరోజు 0830 గంటల IST సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద తీవ్ర అల్పపీడనంగా ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది అండమాన్ నికోబార్ దీవుల వెంబడి ఉత్తర…
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశముందని వాతావరణశాఖ సూచించింది. రెండ్రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో రానున్న మూడ్రోజుల పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బిహార్ నుంచి ఛత్తీస్గఢ్, విదర్భల మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో…