రాయలసీమ నుంచి వికారాబాద్ కు పేలుడు పదార్థాలు తరలిస్తున్న పలువురిని దోమ పోలీసులు అదుపులో తీసుకున్నారు. జడ్చర్లలో పేలుడు పదార్థాలు అమ్మిన ఒకరిని అదుపులో తీసుకుని విచారించగా ఈఘటన వెలుగు చూసింది. కానీ వివరాలను పోలీసులు గోప్యంగా వుంచడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది.
అయితే వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామ శివారులో వెలుతున్న జిలెటిన్స్ స్టిక్స్ వాహనాన్ని పోలీసులు ఆపారు. అందులో .. పేలుడు పదార్థాలు వున్నట్లు గమనించిన పోలీసులు ట్రాక్టర్ ను , బైక్ ను. ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. నిందితున్ని విచారించగా.. జడ్చర్ల నుంచి పేలుడు పదార్థం తీసుకు వచ్చినట్లుగా తెలిపడంతో.. అలర్ట్ అయిన పోలీసులు జడ్బర్ల కు వెళ్లి పేలుడు పదార్థాలు అమ్మిన వ్యక్తి ఇంటికి వెళ్లి విచారించగా.. భయంతో.. ఆవ్యక్తి ఇంట్లో వున్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆ వ్యక్తిని పోలీసులు చికిత్స కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనను పోలీసులు రహస్యంగా వుంచడంపై చర్చనీయాంశంగా మారింది.
కాగా.. హైదరాబాద్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 2 వద్ద గల ఓ భవనంలోని మూడవ అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తోంది. నారాయణగూడ పోలీసులు సైతం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Washington: వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు