HDFC Bank: బ్యాంక్ అకౌంట్లో రూ.18 కోట్లు… తర్వాతేమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీకో బ్యాంక్ అకౌంట్ వుంది. అందులో వెయ్యో.. పదివేలో.. లక్షో డిపాజిట్ చేస్తుంటారు. అయితే మీ ప్రమేయం లేకుండానే అందులో కోట్ల రూపాయలు పడితే మీ గుండె ఆగిపోతుంది కాసేపు. కొంతమంది బ్యాంక్ కస్టమర్ల ఖాతాల్లో కోట్లరూపాయలు జమచేశారు HDFC బ్యాంక్ సిబ్బంది. అనుకోకుండా.. మీ బ్యాంక్ అకౌంట్లో.. ఒక్కసారిగా ఓ లక్ష రూపాయలు వచ్చి పడితే…ఎలా ఉంటుంది? అదే పది లక్షల రూపాయలు.. 18 కోట్లు అయితే మీ ఆశ్చర్యానికి అంతే వుండదు. సంతోషం ఉబ్బితబ్బిబవుతారు. అకౌంట్లో అంత మొత్తం చూస్తే.. తప్పకుండా షాక్ అవుతారు కదా…అలా అవాక్కైయ్యే ఘటననే తెలంగాణ, తమిళనాడులో HDFC బ్యాంకు కష్టమర్లకు ఎదురైంది.
వికారాబాద్ జిల్లాలో వెంకటరెడ్డి అనే కస్టమర్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఒకటి కాదు రెండు కాదు ఒక్క సారిగా 18.52కోట్ల యాభై రెండు లక్షలు ఆయన అకౌంట్లో జమ అయినట్టు మెసేజ్ వచ్చింది. వికారాబాద్ పట్టణంలో మొబైల్ షాప్ నడుపుతాడు వెంకటరెడ్డి. Hdfc వికారాబాద్ బ్రాంచ్ లో ఈ ఘటన జరిగింది. అంత మొత్తం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే బ్యాంక్ అకౌంట్ ని ఫ్రీజ్ చేశారు అధికారులు. దీంతో తన ఖాతా నుంచి ఎటువంటి లావాదేవీలు జరగకపోవడంతో ఇబ్బంది పడ్డానంటున్నాడు వెంకటరెడ్డి.
Also Read
చెన్నైలో ఓ వందమంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు త్యాగరాయానగర్ బ్రాంచ్ లో వినియోగదారులకు ఈ అదృష్టం వరించింది. ఏకంగా వారి ఖాతాలకు రూ13 కోట్ల చొప్పున డబ్బు డిపాజిట్ అయ్యింది. దీంతో అందరూ బ్యాంకులకు పరుగులు తీశారు. ఎంటీఎంల్లో క్యూలు కట్టారు. అయితే సాంకేతిక కారణాలతో కోట్లాది రూపాయలు డిపాజిట్ అయ్యిందని అధికారులు చెప్పటం, అ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడంతో అవాక్కయ్యారు కస్టమర్లు. ఐతే బ్యాంక్ అధికారులు ఇది టెక్నికల్ ఎర్రర్ గా చెబుతున్నారు. డబ్బు జమ అయిన అన్ని ఖాతాలను ఫ్రిజ్ చేశారు. నిన్న ఆదివారం అయినప్పటికీ ఒక కొత్త సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసుకునే క్రమంలో తలెత్తిన పొరపాటుగా చెబుతున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!