Controversy around Patnam Mahender Reddy couple ఊరందరిదీ ఒక దారైతే.. ఉలిపికట్టుది మరోదారి అన్నట్టుగా ఉంది అక్కడ టీఆర్ఎస్ పంచాయితీ. తాజా రగడపై రెండు వర్గాలను పిలిచి పార్టీ పెద్దలు క్లాస్ తీసుకున్నారు. మరి.. సమస్య కొలిక్కి వచ్చినట్టేనా? ఆ ఫ్యామిలీ చుట్టూనే ఎందుకు చర్చ.. రచ్చ అవుతోంది? ఎవరా నాయకులు? రాజకీయాల్లో ఇదో రకమైన ఉడుంపట్టు. అధికారపార్టీలో పెద్ద పదవుల్లో ఉన్నా.. ఏదో వెలితి. అసెంబ్లీకి పోటీ చేయాలి.. గెలిచి పట్టుసాధించాలి. ఈ…
వికారాబాద్‌లోని దోమ మండలం ఊటుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో.. ప్రియుడి ఇంటి ముందే ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఈసీఐఎల్‌కు చెందిన దీప బంజారాహిల్స్‌లోని ఓ సూపర్ మార్కెట్లో పని చేస్తోంది. అక్కడే ఈమెకు నవీన్ అనే అబ్బాయితో ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల్లోనే ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నవీన్ నమ్మించడంతో.. తానే సర్వస్వమని దీప అతడ్ని ప్రేమించింది. అయితే..…
కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఆ ప్రాంతంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం లోని మోరంగాపల్లిలో అసంపూర్తిగా రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ పనులు ముందుకు సాగు…తున్నాయి. దీంతో ప్రజలకు ఎన్నో కష్టాలు. వారికి తోడు ఆ ప్రాంతంలో తిరిగే వారికి నరకయాతన తప్పడం లేదు. సంవత్సరాల తరబడి నిర్మాణ పనులు. పట్టించుకునే నాథుడే లేడు. వర్షం వస్తే చాలు రాకపోకలు బంద్ అవుతాయి. తాజాగా ఓ పెళ్ళి బస్సు బ్రిడ్జి కింద…
రాయలసీమ నుంచి వికారాబాద్ కు పేలుడు పదార్థాలు తరలిస్తున్న పలువురిని దోమ పోలీసులు అదుపులో తీసుకున్నారు. జడ్చర్లలో పేలుడు పదార్థాలు అమ్మిన ఒకరిని అదుపులో తీసుకుని విచారించగా ఈఘటన వెలుగు చూసింది. కానీ వివరాలను పోలీసులు గోప్యంగా వుంచడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. అయితే వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామ శివారులో వెలుతున్న జిలెటిన్స్ స్టిక్స్ వాహనాన్ని పోలీసులు ఆపారు. అందులో .. పేలుడు పదార్థాలు వున్నట్లు గమనించిన పోలీసులు ట్రాక్టర్…
జూన్ నెలలోనే 9,200 గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అందరూ అన్ని పోస్టులకు పరీక్ష రాసేందుకు వీలుగా ఒక దాని తర్వాత మరోక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నామని వివరించారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో పోరాడి 95…
దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లోని HDFC వినియోగదారుల ఖాతాల్లో ఇంకా జమవుతూనే వున్నాయి కోట్లాది రూపాయలు. తాజాగా మెదక్ కి చెందిన వ్యక్తి బ్యాంకు అకౌంట్ లో లక్ష కాదు.. కోటి కాదు ఏకంగా రూ.9.61 కోట్ల రూపాయలు క్రెడిట్ అయ్యాయి. ఖాతాలో రూ.9.61 కోట్లు జమ అయినట్లు మెసేజ్ రావడంతో… నిజమా? కాదా? అనే అనుమానంతో రూ.4.97 లక్షలను మరో ఖాతాకు బదిలీ చేశాడు నరేందర్. ఇంకేముంది.. తనకున్న క్రెడిట్ కార్డ్ బిల్ రూ.1.42 లక్షల…
మీకో బ్యాంక్ అకౌంట్ వుంది. అందులో వెయ్యో.. పదివేలో.. లక్షో డిపాజిట్ చేస్తుంటారు. అయితే మీ ప్రమేయం లేకుండానే అందులో కోట్ల రూపాయలు పడితే మీ గుండె ఆగిపోతుంది కాసేపు. కొంతమంది బ్యాంక్ కస్టమర్ల ఖాతాల్లో కోట్లరూపాయలు జమచేశారు HDFC బ్యాంక్ సిబ్బంది. అనుకోకుండా.. మీ బ్యాంక్ అకౌంట్లో.. ఒక్కసారిగా ఓ లక్ష రూపాయలు వచ్చి పడితే…ఎలా ఉంటుంది? అదే పది లక్షల రూపాయలు.. 18 కోట్లు అయితే మీ ఆశ్చర్యానికి అంతే వుండదు. సంతోషం ఉబ్బితబ్బిబవుతారు.…