కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఆ ప్రాంతంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం లోని మోరంగాపల్లిలో అసంపూర్తిగా రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ పనులు ముందుకు సాగు…తున్నాయి. దీంతో ప్రజలకు ఎన్నో కష్టాలు. వారికి తోడు ఆ ప్రాంతంలో తిరిగే వారికి నరకయాతన తప్పడం లేదు.
సంవత్సరాల తరబడి నిర్మాణ పనులు. పట్టించుకునే నాథుడే లేడు. వర్షం వస్తే చాలు రాకపోకలు బంద్ అవుతాయి. తాజాగా ఓ పెళ్ళి బస్సు బ్రిడ్జి కింద నీటిలో మునిగిపోయింది. హైదరాబాద్లోని బోరబండ కు చెందిన పెళ్లి బస్సు బర్వాద్ గ్రామం కోటపల్లి మండలానికి వచ్చి పెళ్లి ముగించుకొని తిరిగి ప్రయాణం అయింది. అయితే రాత్రి 11 గంటల సమయంలో కేసారం రైల్వే బ్రిడ్జి కింద నీళ్లల్లో బస్సు ఇరుక్కొని ముందుకు కదల లేకుండా పోయింది.
ఆ బ్రిడ్జి కింద అక్కడే ఇరుక్కుపోయింది. బస్సు సగం మునిగిపోయింది. అందులో ఉన్న వారందరూ ఏదోవిధంగా సురక్షితంగా బయటకు వచ్చారు. తెల్లవారేసరికి బస్సు పూర్తిగా నీటిలో మునిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి సంబంధించి అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ రైల్వే వికారాబాద్ కి తెలిపారు. తక్షణమే నీటిని తోడించమని,భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Maharashtra: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ సంక్షోభం.. 11 మంది ఎమ్మెల్యేలతో మంత్రి జంప్!