హైదరాబాద్ అతి సమీపంలో ఉన్న అనంతగిరి కొండల్లో నిత్యం ఏదో ఒక అలజడి కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ తుపాకుల మోత మోగుతూనే వుంటుంది. అనంతగిరి కొండల్లో ఎక్కడో ఒకచోట ప్రతినిత్యం వేటగాళ్లు తుపాకులకు పని చేపు తునే ఉన్నారు. అనంతగిరి కొండలు పర్యాటక కేంద్రం కావడంతో అక్కడ నిత్యం ఏదో ఒక సందడి ఉంటుంది. అయితే కొంత మంది వేటగాళ్లు స్వేచ్ఛగా అక్కడ హంటింగ్ చేస్తున్నారు. దీనిని అరికట్టేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ ఆగడాలు…
ఆ అధికారి రూల్ ప్రకారం వెళ్లారు. అది అధికారపార్టీ ఎమ్మెల్యేకు నచ్చలేదు. పైగా తన పుట్టలోనే వేలు పెట్టడంతో రాత్రికి రాత్రే ఆ ఆఫీసర్‌ను బదిలీ చేయించేశారట. పైగా ఇదంతా లోకల్ ఎమ్మెల్యేకు తెలియకుండా జరగడం విశేషం. దానిపైనే ఇప్పుడు టీఆర్ఎస్తోపాటు.. అధికారుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. 18 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలు వికారాబాద్ జిల్లలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు అడ్డుకున్న అధికారిపై సడెన్‌గా బదిలీవేటు పడటం టీఆర్ఎస్తోపాటు రాజకీయ వర్గాల్లో…
నిత్యం ఏదో ఒక సమస్య. ఒకటి కొలిక్కి వస్తే.. ఇంతలోనే మరో ఇబ్బంది. రాజకీయంగా ప్లస్‌లో పడ్డామన్న సంతోషం క్షణకాలమైన ఉండటం లేదట ఆ ఎమ్మెల్యేకు. ఆనందం ఆవిరైపోతోందట. ఇంతకీ ఎమ్మెల్యేకు వచ్చిన సమస్యేంటి? ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్! ఆనంద్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి స్థానిక నేతలు ఫోకస్! మెతుకు ఆనంద్. వృత్తిరీత్యా డాక్టరైన ఆనంద్.. రాజకీయాలపై ఆసక్తితో టీఆర్ఎస్లో చేరి.. 2018 ముందస్తు ఎన్నికల్లో వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో…
వికారాబాద్ జిల్లాలో పరిగిలో రైతులు ఆంధోళనలకు దిగారు. పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డు మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. పండించిన వరిధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధోళనలు చేస్తున్నారు. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై రైతులు బైఠాయించారు. రోడ్డుపై రాళ్లు పెట్టి వాహనాలను ఆపేశారు. దీంతో దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. కలెక్టర్ వచ్చి స్ఫష్టమైన హామీ ఇచ్చేవరకు నిరసన కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ అమలు జరుగుతున్నది. మధ్యాహ్నం…
ఫస్ట్ వేవ్‌లోనే చాలా మంది ప్రజాప్రతినిధులను పలకరించిపోయింది కరోనా మహమ్మారి.. కొందరు నేతలు, ప్రముఖుల ప్రాణాలు సైతం తీసింది.. తాజాగా, సెకండ్ వేవ్ కలవర పెడుతుండగా.. మరో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇవాళ ఆయన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో.. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యుల సూచన…