మబ్బులు కమ్మిన ఆకాశంలో ఇంద్రధనుస్సు కనువిందు చేస్తుంది. వర్షం వస్తున్నప్పుడు ఆకాశంలో అద్భుతాలు అవిష్కృతం అవుతుంటాయి. వారం రోజులకు పైగా ఆకాశంలో మబ్బులు, వానచినుకులు తప్ప సూరీడు అంతగా కనిపించలేదు. తాజాగా వికారాబాద్‌లో మళ్ళీ వర్షం పడింది. వికారాబాద్ పట్టణంలో వర్షం అనంతరం ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపించింది. వాన చినుకులు కురుస్తుండగా రంగు రంగుల ఇంద్ర ధనుస్సు ఆకాశంలో దర్శనమివ్వడంతో చూపరులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆకాశంలో ఇలాంటివి జరగడం కామన్ అయినా, భారీవర్షాలు కురుస్తున్నవేళ ఈ ఇంద్రధనుస్సు నేత్రానందం కలిగించింది. వికారాబాద్ వాసులు ఈ ఇంద్రధనుస్సు చిత్రాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు.
Godavari Sea Water Colours: నీరంగు నీదే.. నా రంగు నాదే
ఎండా, వాన ఈ రెండు కలిసిన అనుకూల పరిస్థితి ఉన్నప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. తెల్లని సూర్యకాంతి గాలిలోని వాన చినుకులు గుండా ప్రయాణిస్తుంది అటువంటప్పుడు ఆ కాంతి ఏడు రంగులుగా ( VIBGYOR) విడిపోయి ,చినుకకు ఆవలి వైపునకు మనకు ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది. ఈ సమయంలో ఆకాశం ఎంతో నిర్మలంగా, నయనానందకరంగా వుంటుంది. ఈ దృశ్యాలను చూడడానికి రెండు కళ్లు చాలవంటారు ప్రకృతి ప్రేమికులు.
Pawan Kalyan: బటన్ నొక్కితే సరిపోదు.. మానవత్వంతో స్పందించాలి
