కొత్త ఏడాది పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెబుతోంది.. మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతుండడంతో.. ఆ ప్రభావం బంగారంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా ధరలు పడిపోతున్నాయి.. అంతర్జాతీయ పరిస్థితులతో తోడు.. స్థానికంగా బంగారానికి డిమాండ్ తగ్గడంతో మరింత కిందకు దిగివచ్చాయి.. రెండు రోజుల క్రితమే రూ.300లకు పైగా తగ్గిన పసిడి ధర.. ఇవాళ రూ.380 వరకు తగ్గింది.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ.47,847కి పడిపోయింది.. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,828కి పరిమితమైంది.
Read Also: నేడు సీఎంలతో ప్రధాని మోడీ భేటీ.. కీలక ప్రకటన రానుందా..?
ఇక, హైదరాబాద్ బులెలియన్ మార్కెట్‌లోనూ పసిడి ధర తగ్గుముఖం పట్టింది.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.210 పైగా తగ్గి రూ.49,040కి దిగిరాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950కి పరిమితమైంది.. మరోవైపు.. విజయవాడలోనూ హైదరాబాద్ బులెలియన్ మార్కెట్‌లోని ధరలే ఉన్నాయని చెబుతున్నారు.. ఇక, రూ.800కి పైగా తగ్గి కిలో వెండి ధర రూ.60,846కు పడిపోయింది.. అంతర్జాతీయ పరిస్థితులకు తోడు.. దేశీయంగా డిమాండ్ తగ్గడమే పసిడి ధరల తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.