అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. విజయవాడలో ఇవాళ జెండా దిమ్మె విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొనగా.. అరెస్ట్‌లు, ఆందోళన వరకు వెళ్లింది వ్యవహారం.. అయితే. ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు నాదెండ్ల.. జెండా దిమ్మెలు ధ్వంసంతో జనసేన ప్రస్థానాన్ని ఆపగలరా? అని ప్రశ్నించారు.. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అరెస్టు అప్రజాస్వామికం అంటూ మండిపడ్డ…
Vellampalli Srinivas: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలను వైసీపీ నేతలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ 13వ వర్ధంతి సందర్భంగా కంట్రోల్ రూమ్ వద్ద ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్సీ రుహుల్లా, ఇతర నేతలు నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అని వ్యాఖ్యానించారు. 2004 నుంచి 2009 వరకు నభూతో న భవిష్యత్ అనేలా…
పండుగల సీజన్ వచ్చేస్తోంది.. ఒక్కరోజు దాటితే వినాయక చవితి.. ఆ తర్వాత దసరా.. ఇలాంటి సమయంలో.. పువ్వుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.. పండుగల సీజన్ దగ్గర పడటంతో మార్కెట్ లో పువ్వుల ధరలు మండిపోతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. గతం కంటే రొండు రేట్లు అధిక ధరలకు వ్యాపారాలు పువ్వులు అమ్ముతున్నారని చెబుతున్నారు.. కేజీ మల్లెలు, సన్నజాజి పువ్వులు రూ. 400గా పలుకుతుండగా… చామంతి పువ్వులు కేజీ 250 రూపాయల పైమాటే అంటున్నారు.. ఇక, కనకాంబరం…
Face Recognisation App: సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ పేరుతో ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాల్లోని పలువురు టీచర్లు సిద్ధం అవుతున్నారు. అయితే టీచర్ల హాజరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వారిని ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ యాప్ ద్వారా ఆందోళనల్లో పాల్గొనే టీచర్లను గుర్తు పట్టే ప్రయత్నాల్లో నిఘా వర్గాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.…
పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రంగ రంగ వైభవంగా’. ఈ సినిమా సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ మేరకు శనివారం నాడు చిత్ర యూనిట్ సభ్యులు ఉదయం తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ చేరుకుని సందడి చేశారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ ఫ్యాన్స్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. రంగ…
విజయవాడలో చెత్తపన్ను వసూలు చేయలేదని ఇద్దరు సచివాలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. 48, 57వ వార్డు సచివాలయాల్లో శానిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు చెన్నకృష్ణ, సలీమ్ బాష టార్గెట్ మేరకు చెత్తపన్ను వసూలు చేయడంలో విఫలం అయ్యారని విజయవాడ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇద్దరి సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెత్త పన్ను వసూళ్లల్లో నిర్లక్ష్యం వహిస్తుండడంపై ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా చెత్త పన్నును వసూలు చేయాలని మున్సిపల్…
Anurag Thakur: బీజేవైఎం ముగింపు సభలో పాల్గొనేందుకు బయలుదేరిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ కనక దుర్గమ్మను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఠాకూర్ మాట్లాడుతూ.. ఏపీలో మంచి ప్రభుత్వం రావాల్సి వుందని సంచళన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ, ప్రస్తుత వైసీసీ పాలన ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. జవాబుదారీ ప్రభుత్వం, ప్రజారంజకంగా పాలన అందించే ప్రభుత్వం త్వరలోనే ఏపీలో…