సచివాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలపై అధికారులతో డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్షించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది విష్ణు, కలెక్టర్ దిల్లీ రావు, దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్, పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా హాజరయ్యారు. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను అధికారుల నుంచి మంత్రి కొట్టు సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా…
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి విజయవాడలో పర్యటించనున్నారు.. మూడేళ్ల తర్వాత మళ్లీ విజయవాడలో అడుగుపెట్టబోతున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… గతం పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం అయ్యారు కేసీఆర్.. 2019 జూన్‌లో కేసీఆర్-వైఎస్ జగన్ మధ్య సమావేశం జరిగింది.. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్‌కు సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు.. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు ఏపీ సీఎం.. హైదరాబాద్‌లోనూ రెండు రాష్ట్రాల అంశాలపైన ఇద్దరు సీఎంలు, అధికారులతో…
Narayana Swamy: ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రమంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో పశ్చిమ బైపాస్ పనులను పరిశీలించిన ౠయన రహదారి పనులను నేషనల్ హైవే అథారిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పశ్చిమ బైపాస్ విస్తరణ తర్వాత అమరావతి ఒక జిల్లాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వ సహకారం ఆశించిన స్థాయిలో లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రాజధానులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని..…
భారత్‌లో బంగారానికి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది.. ఏ శుభకార్యం జరిగినా పసిడి కొనేస్తుంటారు.. ఇక, పెళ్లిళ్లకైతే చెప్పాల్సిన పనేలేదు.. ధరలతో సంబంధం లేకుండా.. అవసరాన్ని బట్టి పెద్ద ఎత్తున బంగారం కొనుగుళ్లు సాగుతుంటాయి.. అయితే, గత రెండు రోజులగా పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. పసిడి ధరలు కిందికి దిగివచ్చాయి.. ఇవాళ్టి ధరల్లో కూడా ఎలాంటి మార్పులేదు.. దీంతో.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, విశాఖపట్నం ఇలా.. అన్ని ప్రాంతాల్లోనూ బంగారం ధరలు…
Venkaiah Naidu: విజయవాడలో మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆయన స్నేహితులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, వైసీపీకి చెందిన యువ నేత దేవినేని అవినాష్, బీజేపీకి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమం ద్వారా పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు,…
Theft Case: రోజురోజుకు హైదరాబాద్ లో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. బస్సులో, రైళ్లల్లో ఆగంతకులతో జాగ్రత్త గా ఉండమని ప్రయాణికులకు చెప్తున్నా ఎక్కడో ఓ చోట దుండగులు రకరకాలుగా దోచుకుంటున్నారు.
Vijayawada: ఏపీలో అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. ఈ మేరకు విజయవాడలో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ధర్నా చౌక్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆక్రందన సభ చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వారంలో న్యాయం చేస్తామని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు స్పందించడంలేదంటూ అగ్రిగోల్డ్ బాధితులు విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్…