Vellampalli Srinivas: వైఎస్ఆర్ చనిపోయి 13 ఏళ్ళు అయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vellampalli Srinivas: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలను వైసీపీ నేతలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ 13వ వర్ధంతి సందర్భంగా కంట్రోల్ రూమ్ వద్ద ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్సీ రుహుల్లా, ఇతర నేతలు నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్‌ను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అని వ్యాఖ్యానించారు. 2004 నుంచి 2009 వరకు నభూతో న భవిష్యత్ అనేలా వైఎస్ఆర్ పరిపాలన జరిగిందన్నారు. వైఎస్ఆర్ చనిపోయి 13 ఏళ్ళు అయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తుచేసుకున్నారు. వైఎస్ అమలు చేసిన పథకాల్లో ఒక్కటి కూడా చంద్రబాబు కొనసాగించలేకపోయారని ఆరోపించారు.
14 ఏళ్ళు సీఎంగా పని చేసిన చంద్రబాబు పాలన చూస్తే ఒక్క పథకం గుర్తుకు రాదని.. సీఎం జగన్ మళ్లీ వైఎస్సార్ పథకాలను అమలు చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. రూ.2కే కిలో బియ్యం పేరు చెప్తే ఎన్టీఆర్, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్, అమ్మఒడి అంటే జగన్ గుర్తుకొస్తాయన్నారు. చంద్రబాబు అంటే కరువు కాటకాలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. తనదైన శైలిలో ఉమ్మడి రాష్ట్రంలో మహానేత వైఎస్ఆర్ అనేక కార్యక్రమాలు రూపొందించారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాలు చరిత్రలోనే నిలిచిపోయాయన్నారు. పాలన అంటే వైఎస్సార్ ముందు వైఎస్సార్ వెనుక అనేలా ఉందన్నారు. సమాజంలో వెనుకబడిన కులాలను సీఎం జగన్ ముందుకు తెచ్చారన్నారు. వైఎస్ఆర్ ఆలోచనలు, సిద్ధాంతాలకు అనుగుణంగా జగన్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఐఐఐటీలు, బందరు పోర్టు వంటివి వైఎస్ఆర్ హయాంలో మన ప్రాంతానికి వచ్చాయన్నారు. రూపాయి డాక్టరుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి వైఎస్ఆర్ కోట్లమంది మనసులను గెలుచుకున్నారన్నారు.
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
వైఎస్ఆర్ ప్రజల గుండెచప్పుడు తెలుసుకున్న నేత అని మేయర్ రాయన భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించారు. వైద్య వృత్తిలో ఉండడం వల్ల ప్రజలకు వైద్యం ఎంత అవసరమో తెలుసుకున్న నాయకుడు అన్నారు. వైఎస్ఆర్ హయాంలో జరిగిన సంక్షేమం, వైద్యం అప్పట్లో ఒక సంచలనం అని.. జగన్ తండ్రి కంటే పది అడుగులు ముందుకు వేసి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!