Off The Record: 2029 అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఇప్పటి నుంచే గ్రౌండ్ క్లియర్ చేసుకుంటున్నారా అంటే…అవును, వాతావరణం అలాగే కనిపిస్తోందన్నది పరిశీలకుల సమాధానం. తన విషయంలో పార్టీ పెద్దల ఆలోచన ఎలాఉందో… చూచాయగా తెలుసుకున్న అవినాష్….అందుకు భిన్నంగా ఇప్పట్నుంచే పావులు కదిపి అప్పటికి లైన్ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారట. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అవినాష్. ఆ తర్వాత 2019లో టీడీపీ అభ్యర్థిగా గుడివాడ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారాయన. మరోసారి పార్టీ మారి… గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ముచ్చటగా మూడోసారి పరాజయం పాలయ్యారు దేవినేని అవినాష్. ఇక అధికారం పోయాక వైసీపీ అధిష్టానం పార్టీ పరంగా చేసిన మార్పులు చేర్పుల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ అనుచరగణం బలంగా ఉండటంతో పాటు యువకుడు కావడంతో… యాక్టివ్‌గా ఉంటారన్న ఉద్దేశ్యంతో బాధ్యతలు అప్పగించారు పార్టీ పెద్దలు. దీంతో…ఈసారి వైసీపీ తరపున లోక్‌సభకు ఆయన అభ్యర్థిత్వంపై చర్చలు మొదలయ్యాయి.
Read Also: US-India: భారత్‌కు షాక్ ఇచ్చిన అమెరికా.. ఇరాన్ ‘‘చాబహార్’’ పోర్టుపై కీలక నిర్ణయం..
అధిష్టానం ఆ ఉద్దేశ్యంతోనే… ఆయన్ని జిల్లా అధ్యక్షుడిని చేసిందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి బెజవాడ పొలిటికల్ సర్కిల్స్‌లో. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అవినాష్‌ను లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపితే ఎలా ఉంటుందని పార్టీలో కూడా గట్టిగానే జరుగుతోందట. పార్టీ వేరైనా…గతంలో ఎంపీ సీటుకు పోటీ చేసిన అనుభవం ఉండటం కూడా ఈ చర్చకు ప్రధాన కారణమని సమాచారం. ఇక ఇదే సమయంలో వైసీపీ విజయవాడ పార్లమెంట్ సీట్లో వరుసగా మూడు సార్లు ఓడిపోయింది. పార్టీ ఏర్పాటైన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఈ సీటును గెలవలేకపోయింది. మూడు పర్యాయాలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే టిక్కెట్ ఇచ్చినా వర్కౌట్ అవలేదు. ఈ పరిస్థితుల్లో… తన ఎంపీ అభ్యర్థిత్వం గురించి చర్చ జరగడంతో… ఉలిక్కిపడ్డారట అవినాష్. ఆలస్యం చేస్తే… ఇది మరింత పెరిగి కొంప మునుగుతుందన్న భయంతో… పార్టీ అధిష్టానానికి ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ఢిల్లీ నావల్ల కాదు, నేను పక్కా లోకల్ అని తేల్చి చెప్పేసినట్టు సమాచారం. ఎంపీ అభ్యర్థిత్వం నాకు ఇష్టం లేదు, అసెంబ్లీకే పోటీ చేస్తానని చెప్పి అదే విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళేలా జాగ్రత్త పడ్డారట. తన తండ్రి ఎప్పుటూ అసెంబ్లీకే మొగ్గు చూపారని, తాను కూడా అదే బాటలో నడవాలనుకుంటున్నానని అనుచరులకు కూడా చెప్పేశారట అవినాష్. దీంతో ఆయన ఢిల్లీ వెళ్ళేందుకు ఆసక్తిగా లేరని క్లారిటీ వచ్చినట్టైందంటున్నారు.
ఇదే సమయంలో అసెంబ్లీ సీటు విషయమై కూడా…మరో చర్చ నడుస్తోంది రాజకీయవర్గాల్లో. ఇప్పటి వరకు దేవినేని ఫ్యామిలీకి విజయవాడ తూర్పు నియోజకవర్గం విజయాన్ని అందించలేదు. గతంలో అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ పోటీ చేసినా, తాజాగా గత ఎన్నికల్లో అవినాష్ బరిలో దిగినా… పరాజయమే పలకరించింది. దీంతో ఈసారి తూర్పును వదిలి కొత్త నియోజకవర్గానికి వెళ్ళాలనుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కలిసి ఉన్న పెనమలూరు నుంచి ఈసారి ఆయన బరిలో దిగే అవకాశాలు ఉన్నాయనేది పొలిటికల్ సర్కిల్స్ టాక్. దీని మీద అవినాష్ క్లారిటీ ఇవ్వకున్నా… ప్రచారం మాత్రం గట్టిగానే జరుగుతోంది. ప్రస్తుతం పెనమలూరు కృష్ణా జిల్లాలో ఉన్నప్పటికీ… పునర్విభజన ప్రక్రియలో తిరిగి ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతారని ఆశిస్తున్నారు. అందుకే అటువైపు చూస్తున్నారట అవినాష్. ఇంకా మూడున్నరేళ్ళ తర్వాత జరగబోయే ఎన్నికల కోసం ఇప్పట్నుంచే సీట్ల పంచాయితీ మొదలవడంతో… అప్పటికి పరిస్థితులు ఎలా మారతాయో, ఎన్ని మార్పులు ఉంటాయో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.