‘విజయవాడ’ పేరులోనే విజయం ఉందని.. చరిత్ర రాయాలన్నా, సృష్టించాలన్నా విజయవాడతోనే సాధ్యం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు భాష అభివృద్ధికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. జీవోలన్ని తెలుగులో వస్తున్నాయంటే అది వెంకయ్య నాయుడుతోనే సాధ్యం అని పేర్కొన్నారు. ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే అన్నారు. వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబుతో తాను పోటీ పడలేకపోతున్నానని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో శోభాయమానంగా…
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు అయ్యింది.. దీనిపై కీలక ప్రకటన చేశారు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి.. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్ కు అవకాశం ఇచ్చామని తెలిపారు.. గరిష్టంగా 3 కంపెనీలు కలిసి జేవీగా టెండర్లు వేసుకునే అవకాశం ఉందన్నారు..
బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆశ్విజ శుద్ధ పాడ్యమి సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలో ఓ నామినేటెడ్ పోస్ట్ కోసం పవన్కళ్యాణ్, బాలకృష్ణ పోటీ పడ్డారా? నా మనిషికి కావాలంటే… నా మనిషికి అంటూ… వత్తిడి పెంచారా? మాంఛి సినిమా కథను తలపించిన ఆ ఎపిసోడ్లో చివరికి బాలయ్యదే పైచేయి అయిందా? రెండు పెద్ద తలకాయలు అంతలా తలపడ్డ ఆ పోస్ట్ ఏది? డిప్యూటీ సీఎంను కాదని ఎమ్మెల్యే మనిషికి ఎలా ఫైనల్ అయింది? ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ముఖ్యమైన దేవాలయాలకు పాలక మండలి ఛైర్మన్స్ను నియమించింది. శ్రీశైలం,…
కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు రాజ్ గోపాల్ రెడ్డి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనడానికి గుంటూరు వచ్చాను. ఈరోజు విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకున్నాను.. నేను ఇక్కడికి బయలుదేరినప్పటి నుండి రాజకీయంగా నా పై దుష్ప్రచారం చేస్తున్నారు.. నేను నిన్ననే మీడియా ముందు క్లారిటీ ఇచ్చాను.. కొంతమంది కావాలని నా ప్రతిష్టను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారు.. వాటిని నమ్మకండి.. నేను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవడం లేదు అన్నారు..
Off The Record: 2029 అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఇప్పటి నుంచే గ్రౌండ్ క్లియర్ చేసుకుంటున్నారా అంటే…అవును, వాతావరణం అలాగే కనిపిస్తోందన్నది పరిశీలకుల సమాధానం. తన విషయంలో పార్టీ పెద్దల ఆలోచన ఎలాఉందో… చూచాయగా తెలుసుకున్న అవినాష్….అందుకు భిన్నంగా ఇప్పట్నుంచే పావులు కదిపి అప్పటికి లైన్ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారట. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అవినాష్. ఆ తర్వాత…