Sri Mahishasura Mardini Devi: దసరా మహోత్సవాలు పదవ రోజుకు చేరుకున్నాయి.. ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన దుర్గమ్మ మహార్నవమి నేడు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తున్నారు.. మహిషాసురమర్దిని అవతారానికి ప్రత్యేకత ఉంది.. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసురమర్దని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అయితే, శరన్నవరాత్రులలో దర్శనమిస్తున్న దేవి అలంకారాలలో మహిషాసురమర్దనికి ఎంతో విశిష్టత ఉంది. సప్తశతిలో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకో పకారం చేసిన ఘట్టం వర్ణితమైంది.. సింహావాహినిగా రూపొందిన శక్తి…
Actress Hema: చేయని తప్పుకి నన్ను బలి చేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు టాలీవుడ్ సీనియర్ నటి హేమ.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఆమె.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మ ఆలయంలో కన్నీరు పెట్టుకున్నారు.. ఈ రోజు దుర్గమ్మ దర్శనానికి వచ్చాను, ప్రతీ ఏడాది వస్తాను అని తెలిపిన ఆమె.. అయితే, ఈ సంవత్సరం ఓ ప్రత్యేకత ఉంది.. గత ఏడాది మీరందరూ నాపై వేసిన నీలపనిందలు దుర్గమ్మ తుడిచిపెట్టిందన్నారు.. ఇక, నేను చేయని తప్పుకి…
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై 2025 దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ‘మూలా నక్షత్రం’ రోజు కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి అర్ధ రాత్రి నుంచే భక్తులను అనుమతించారు. దీంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. అమ్మవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వినాయక గుడి నుంచి సుమారు 3 కిమీ మేర భక్తులు బారులు తీరారు. ఉదయం 9:30 గంటలకు లక్ష…
CM Chandrababu: ఈ రోజు చరిత్రలో గర్వించదగ్గ రోజు అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడలో నిర్వహించిన బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఎస్ఎన్ఎల్ శక్తిమంతమైన వ్యవస్థగా మారిందన్నారు.. ఇక, ప్రపంచంలోనే భారతీయులు శక్తిమంతంగా మారారన్నారు చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని.. సరైన సమయంలో, సరైన వ్యక్తి, సరైన ప్రాంతంలో మోడీ ఉన్నారని అభినందించారు.. 1995లో నేను సీఎంగా…
విజయవాడ దుర్గ గుడి ఆలయ బోర్డు సభ్యులుగా 16 మందిని నియమిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులకు దుర్గ గుడి ఆలయ బోర్డు సభ్యులుగా అవకాశం దక్కింది. కొద్ది రోజుల క్రితం దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్గా కృష్ణా జిల్లాకు చెందిన బొర్రా రాధాకృష్ణని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 16 మంది బోర్డు సభ్యుల లిస్ట్ ఓసారి చూద్దాం. Also Read: Sunil Gavaskar: ఐపీఎల్ ఆడుతా.. 76 ఏళ్ల…
‘విజయవాడ’ పేరులోనే విజయం ఉందని.. చరిత్ర రాయాలన్నా, సృష్టించాలన్నా విజయవాడతోనే సాధ్యం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు భాష అభివృద్ధికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. జీవోలన్ని తెలుగులో వస్తున్నాయంటే అది వెంకయ్య నాయుడుతోనే సాధ్యం అని పేర్కొన్నారు. ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే అన్నారు. వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబుతో తాను పోటీ పడలేకపోతున్నానని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో శోభాయమానంగా…
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు అయ్యింది.. దీనిపై కీలక ప్రకటన చేశారు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి.. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్ కు అవకాశం ఇచ్చామని తెలిపారు.. గరిష్టంగా 3 కంపెనీలు కలిసి జేవీగా టెండర్లు వేసుకునే అవకాశం ఉందన్నారు..
బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆశ్విజ శుద్ధ పాడ్యమి సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.