పదేళ్ళలో ఏపీకి ఏమీ జరగలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. విజయవాడలోని యం.బి స్టేడియంలో జరిగిన ప్రజారక్షణ భేరీ సభలో ఆయన ప్రసంగించారు. విభజన చట్టంపై రాజ్యసభలో చాలా చర్చలు జరిగాయని.. ఆలోచన లేకుండా విభజన చేస్తున్నారు అని తెలిపారు.
ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేయనున్నారు. ఈరోజు దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధానాలయము నందు సాయంత్రం 5 గంటలకు ధనలక్శ్మి పూజను నిర్వహించారు. సాయంత్రం 06 గంటలకు అమ్మవారికి పంచహారతులు సేవను నిర్వహించారు.
2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి మైనారిటీ డేను ప్రకటించారు.. దేశంలోనే తొలి సారి మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి.. నాన్న ఒక అడుగు వేస్తే.. మీ బిడ్డ రెండు అడుగులు వేశాడు అని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా విజయవాడలో మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేసిన వ్యక్తి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి అని సీఎం జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీఎం వైఎస్ జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. అజాద్ జయంతి సందర్భంగా మైనారిటీస్ వెల్పేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో పాల్గొననున్నారు.
విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రారంభించారు సినీ హీరో, పద్మ భూషణ్ కమల్ హాసన్.. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు.
Vijayawada: కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని.. పుణ్యక్షేత్రాలను దర్శించాలనే ఆశ మనలో చాలామందికి ఉంటుంది. అలా టూర్ కి వెళ్లాలనే ఆసక్తి ఉన్నవాళ్ళకి రైల్వే టూరిజం డిప్యూటీ జనరల్ మేనేజర్ శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే టూరిజం డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ సత్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Irctc భారత్ గౌరవ్ టూరిజం ట్రైన్ ఏర్పాటు చేసారని పేర్కొన్నారు. కాగా ఈ ట్రైన్ న్ని 13 పుణ్యక్షేత్రాలకు టూర్స్ కు నియమించడం జరిగిందని…