విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండులో దుర్ఘటనతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ బస్సు యాక్సిడెంట్ పై నివేదిక సిద్ధమైంది. నివేదికపై అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు చర్చిస్తున్నారు.
విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.. పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్టాండులో ప్లాట్ఫారమ్ మీదకు దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు.. ఈ ఘటనలో ఇద్దరు అక్కడి అక్కడే మృతిచెందగా.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక బస్టాండ్లో ఉన్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు.. ఉదయం సర్వ సాధారణంగా నెహ్రూ బస్టాండ్ రద్దీగా ఉంటుంది.. ఈ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.
రాజకీయ నాయకుడివే కాదు కనుక రెంటుకు పార్టీ పెట్టావు పవన్.. పోటీ చేయలేడు కాబట్టే పవన్ పార్టీ అద్దెకు పెట్టాడు అని ఎంపీ విమర్శలు గుప్పించారు. బీసీలను ఎక్కిరించిన చంద్రబాబు బీసీ తీర్పుతోనే జైలు కెళ్ళాడు అంటూ ఎంపీ నందిగం సురేష్ అన్నారు.
వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాడు కాబట్టే చంద్రబాబును ప్రజలు ఓడించారు అని మంత్రి జోగి రమేష్ తెలిపారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసినా ఓడిపోయేలా ప్రజలు చేయాలి..
చంద్రబాబు సీఎం, ఎంపీ నాని, పారిపోయిన జలీల్ ఖాన్, దద్దమ్మ దేవినేని ఉమ ఉండి కూడా వన్ ఔన్ అభివృద్ధి కాలేదు అంటూ వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ ఆహ్వానించదగినది.. అభివృద్ధి చేసిన సీఎం జగన్ ను గుర్తు పెట్టుకోవాలి అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈనెల 15న విజయవాడలో జరుగనున్న ప్రజా రక్షణ భేరి సభ విజయవంతం కోసం సీపీఎం సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య అధిపత్య పోరు కొనసాగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.
వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు-2023ని అందజేయనున్నారు.. ఏపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆ కార్యక్రమం జరగనుంది.. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఏ1- కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.