నా శేష జీవితం ప్రజలకే అంకితం.. ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడబోను అని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ రోజు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టాను అన్నారు.. రేపు సింహాచలం దర్శనం చేసుకుని, 5న శ్రీశైల దర్శనం, అనంతరం దర్గాకు కూడా వెళ్తాను అన్నారు. ఆ తర్వాత భవిష్యత్…
సామాజిక విప్లవానికి నిదర్శనమే విజయవాడలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం అన్నారు మంత్రి మేరుగ నాగార్జున.. ఏపీ చరిత్రలో సామాజిక సమతుల్యత కోసం సీఎం వైఎస్ జగన్ ఈ నిర్మాణం చేస్తున్నారని తెలిపారు.. అంబేద్కర్ చరిత్ర ఈ నిర్మాణంలో తెలుస్తుందన్నారు. త్వరలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభిస్తాం అని వెల్లడించారు.
నేటి నుండి ఇంద్రకీలాద్రి పై భవాని మండల దీక్ష ధారణ ప్రారంభమైంది. కాగా ఇంద్రకీలాద్రి పై ఈ రోజు ప్రారంభమైన భవాని మండల దీక్ష ఈనెల 27 వ తేదీ వరకు వరకు ఉంటుంది.
England Under-19 Cricket Team visited Vijayawada Kanaka Durga Temple: ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. 19 మంది జట్టు ఆటగాళ్లు మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి, అధికారులు వారికి మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఇంగ్లీష్ ఆటగాళ్లకు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రంను పాలకమండలి సభ్యులు అందజేశారు. Also Read: Telangana Elections 2023: కేసీఆర్కు బిగ్…
4 Injured in Vijayawada Car Racing: ఏపీలోని విజయవాడ నగరంలోని జాతీయ రహదారిపై శనివారం (నవంబర్ 18) అర్ధరాత్రి కార్ల రేసింగ్ జరిగింది. బెంజ్, ఫార్చ్యూనర్ కార్లతో యువతీ, యువకులు రేస్ నిర్వహించారు. ఐఈపీఎల్ ఐనాక్స్ ఎదురుగా రెండు కార్లు అతివేగంగా దూసుకొచ్చాయి. ఓ ఫార్చూనర్ కారు అదుపుతప్పి రామవరప్పాడు వైపు వెళ్తున్న 2 స్కూటీలను ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలైన వీరిని స్థానికులు వేంటనే…
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను వివరించేందుకు విజయవాడలో జరిగిన యువ ఓటర్ చైతన్య వేదిక కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ కాలేజీ పీఎస్సీఎంఆర్ కాలేజ్.. అందుకే ఇక్కడి నుండే ఈ పోగ్రాం మెదలుపెట్టానని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
విజయవాడలో ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు గుండెపోటుతో మృతి చెందారు. రమేష్ కార్డియాక్ హాస్పటల్స్లో సుదీర్ఘ కాలంగా కార్డియాలజీ సర్జన్గా పేరొందిన డాక్టర్ పాటిమళ్ల శ్రీనివాస ప్రసాద్ మంగళవారం రాత్రి అనూహ్యంగా సైలెంట్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
మోదీకి, అమిత్ షా కి తెలీకుండా చంద్రబాబును బొక్కలో వేయలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. జనసేన నాయకుడు మోడీని పొగడటమే సరిపోయింది బీసీ సభలో అంటూ ఆయన ఎద్దేవా చేశారు.