వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాడు కాబట్టే చంద్రబాబును ప్రజలు ఓడించారు అని మంత్రి జోగి రమేష్ తెలిపారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసినా ఓడిపోయేలా ప్రజలు చేయాలి..
చంద్రబాబు సీఎం, ఎంపీ నాని, పారిపోయిన జలీల్ ఖాన్, దద్దమ్మ దేవినేని ఉమ ఉండి కూడా వన్ ఔన్ అభివృద్ధి కాలేదు అంటూ వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ ఆహ్వానించదగినది.. అభివృద్ధి చేసిన సీఎం జగన్ ను గుర్తు పెట్టుకోవాలి అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈనెల 15న విజయవాడలో జరుగనున్న ప్రజా రక్షణ భేరి సభ విజయవంతం కోసం సీపీఎం సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య అధిపత్య పోరు కొనసాగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.
వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు-2023ని అందజేయనున్నారు.. ఏపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆ కార్యక్రమం జరగనుంది.. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఏ1- కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.
విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను భగవంత్ కేసరి చిత్ర బృందం శనివారం దర్శించుకుంది. హీరోయిన్ శ్రీలీలా ఆమె తల్లి, చిత్ర దర్శకుడు అనిల్ రావీపూడితో పాటు పలువురు చిత్ర బృంద సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.. అనంతరం ఆలయ అధికారులు వారిని సత్కరించి అన్న, ప్రసాదాలను అందజేశారు.. శ్రీలీలా తో సెల్ఫీలు…