విజయవాడ: ఇంద్రకిలాద్రీ అమ్మవారి గుడిలో గురుభవానీల దీక్షా విరమణలకు అన్ని ఏర్పాట్టు చేస్తున్నామని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు వెల్లడించారు. బుధవారం జరిగిన పాలమండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణలు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు గుడిలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ‘ఈసారి 5 లక్షల పైగా భవానీ మాలధారులు దీక్ష విరమణకి ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం…
చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్, లోకేష్.. ఆ ముగ్గురి మధ్య మూడు గంటల పాటు సాగిన చర్చలు ఇప్పుడు కీలకంగా మారాయి.. ఏపీలో రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ ఎత్తుగడులు వేస్తారు. పీకే.. టీడీపీతో కలిసి పనిచేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఓట్ల పంచాయితీ కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు మార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి పోటీ పోటీగా ఫిర్యాదులు చేశారు రెండు పార్టీల నేతలు.. ఇప్పుడు రెండు రోజుల పాటు రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి పోటీపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు వైసీపీ-టీడీపీ, జనసేన పార్టీల నేతలు.
Vijayawada Medical Student Dies in Chicago: ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి ఆశలు ఆవిరయ్యాయి. విజయవాడకు చెందిన వైద్య విద్యార్థిని కారులో ప్రయాణిస్తూ మృతి చెందింది. కారులో గ్యాస్ లీక్ అవ్వడంతో వైద్య విద్యార్థిని దుర్మరణం పాలైంది. యువతి మరణంతో విజయవాడలోని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విద్యార్థిని మృతికి సంబంధించి వైద్య నివేదిక రావాల్సి ఉంది. వివరాల మేరకు.. విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్…
న్యాయస్థానం ముందు ప్రతి ఒక్కరు సమానమే. కానీ విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణకు శ్రీనివాస్ రెడ్డి బదులు డ్రైవర్ వెళ్ళటంతో న్యాయమూర్తి గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు.