Bhakthi: విజయవాడ లో ఇంద్రకీలాద్రి పైన వెలసిన కనక దుర్గ అమ్మవారిని ఆరాధించే భక్తులు ఎందరో ఉన్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువని ఆ కనక దుర్గను ఆరాధిస్తారు భక్తులు. ఇక ఆ భవాని మాత మండల దీక్షను చేపట్టేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తారు. ఇంద్రకీలాద్రి పై భవాని మండల దీక్షను తీసుకోవాలని చాల మంది అమ్మవారి భక్తులు ఎదురు చూస్తుంటారు. అయితే అమ్మవారి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఆ నిమిషం ఆసన్నమైంది. నేటి నుండి ఇంద్రకీలాద్రి పై భవాని మండల దీక్ష ధారణ ప్రారంభమైంది. కాగా ఇంద్రకీలాద్రి పై ఈ రోజు ప్రారంభమైన భవాని మండల దీక్ష ఈనెల 27 వ తేదీ వరకు వరకు ఉంటుంది.
Read also:KIMS Hospital: కిమ్స్ ఆస్పత్రిలో మంటలు.. తీవ్ర ఇబ్బందులుపడ్డ రోగులు
అలానే అర్ధమండల దీక్షా ధారణ డిసెంబరు 13 వ తేదీ నుంచి ప్రారంభమై 17 వ తేదీ వరకు ఉంటుంది. ఎవరైతే భవాని అర్ధమండల దీక్ష ధారణ చేపట్టాలి అనుకుంటున్నారో వారు డిసెంబరు 13 వ తేదీ వరకు వేచి ఉండాలి. ఇక దీక్ష విరమణ విషయానికి వస్తే దీక్షను చేపట్టిన భక్తులు జనవరి 3 వ తేదీ నుంచీ జనవరి 7 వ తేదీ వరకు దీక్షను విరమించుకోవచ్చు. కాగా విజయవాడ లోని ఇంద్రకీలాద్రి పైన వెలసిన కనక దుర్గ అమ్మవారి సన్నిధిలో నిరవహించే కళశజ్యోతి నగరోత్సవం డిసెంబరు 26 వ తేదీ సాయంత్రం 06 గంట ల నుంచీ ప్రారంభం అవుతుంది.