విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు ఎల్లుండి(శుక్రవారం) నుంచి మూడు రోజులపాటు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ కూరగాయలు, ఆకులు, ఆకు కూరలతో అర్చకులు, అధికారులు అమ్మవారిని అలంకరించనున్నారు.
సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ప్రజల అవగాహన లేమిని తెలివిగా వాడుకుంటూ కోట్లు నొక్కేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా.. పదే పదే నేరాలు జరగడం తీవ్రతకు అద్ధం పడుతోంది. బెజవాడలో గత 10 రోజుల్లో 5గురు సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షల్లో డబ్బుల్లో పోగొట్టుకొని పోలీసులను ఆశ్రయించారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు, ఎంపికి ఆహ్వానం పంపకపోవడంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు.