Monkeypox: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి.. దీంతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలతో మంకీపాక్స్కు ప్రత్యేక వార్డును వైద్య అధికారులు ఏర్పాటు చేశారు.
విజయవాడ గుణదల ఈఎస్ఐ ఆస్పత్రిని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. గత ఐదేళ్ల పాలనలో ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్వీర్యం చేసి అవినీతిమయం చేశారని ఆయన మండిపడ్డారు. సరైన పరికరాలు లేకుండా చేశారని.. ఉద్యోగుల భర్తీని కూడా చేయలేదన్నారు.
విజయవాడలో క్రికెట్ అకాడమీ స్థాపనకు కృషి చేస్తాం అని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ఏపీ రాజధాని అమరావతితో పాటు విజయవాడ అభివృద్ధికి పాటుపడతాం అని తెలిపారు. నేడు విజయవాడలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అథిదులుగా హజరయ్యారు. ఈ ఇద్దరిని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఆత్మీయ సమావేశం సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ……
Vijayawada Traffic: రేపు ఉదయం 9 గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం విజయవాడలో జరిగే 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఇతర ముఖ్య అతిధులు హాజరుకానున్నారు.
ఢిల్లీ వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం.. జాతీయ ఎస్సీ కమిషన్ను కలిసింది.. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను కలిశారు వైసీపీ నేతలు.. విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు.
కుటుంబాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకోవడం ఒక ఉత్తేజకరమైన ప్రయాణం, కానీ కొంతమందికి, ఇది సవాళ్లతో కూడా రావచ్చు. మీరు గర్భం ధరించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటుంటే, సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించడం మీ మాతృత్వ కలను సాధించడానికి కీలకమైన దశ. సంతానోత్పత్తి నిపుణుడి సహాయం పొందే సమయం కావచ్చు అనే కొన్ని ముఖ్య సూచికలు ఇక్కడ ఉన్నాయి.
Chiyan Vikram On Tangalan Promotions: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా స్వాతంత్య్ర…
Chandrababu: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు.