బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది.. అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడే పనే లేదు అని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సూచనతో పాలక మండలి కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
పెట్రోల్ బంకులు ఎప్పుడూ వాహనదారులతో రద్దీగా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు క్యూ కట్టడంతో పాటు రద్దీగా ఉన్న సమయంలో బంకుల్లో చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి. కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ తక్కువగా రావడం, రీడింగ్‌లో మోసం, కొలతలో మోసం, నాణ్యత లేని ఇంధనం, ఎక్కువ డబ్బు తీసుకోవడం లాంటి మోసాలు ఇటీవల జరగుతున్నాయి.
ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీసీబీ ఓఎస్డీ (OSD) రామారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఘటన జరిగిన రోజే పీసీబీ ఉద్యోగులు నాగరాజు, రూపేంద్ర మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఓఎస్డీ రామారావుపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీసులు. గతంలో నమోదు 106 సెక్షన్ ను మార్చి కొత్తగా అదనపు సెక్షన్లను కలిపి ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని చెప్పారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్‌కు కూడా నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.
AP Volunteers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీకి వాలంటరీలను తీసుకోవడం లేదు. సచివాలయ ఉద్యోగులు ఇతర ఉద్యోగుల ద్వారానే ఆ డబ్బులను పంపకాలు చేసింది. కేవలం ఒక్క రోజులోనే చాలా వరకు పెన్షన్లు కూడా సచివాలయ ఉద్యోగులు చేత అదించారు. దీంతో ఇక వాలంటరీ వ్యవస్థతో అవసరం లేదు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లను విధులనుంచి ప్రభుత్వం తొలగిస్తుంది అనే ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఆందోళన…
ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢ మాసపు సారె ఇస్తారు అని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈఓ రామారావు తెలిపారు. ఆలయంలోని ఆరవ అంతస్తులో ఆషాఢ మాసపు సారెకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సారె ఇచ్చిన వారికి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.