PCB Files Burning Case: పీసీబీ ఫైల్స్ దహనం కేసులో ట్విస్ట్..
- పీసీబీ ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం..
- బెజవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో పోలీసుల దర్యాప్తు..
- పీసీబీలో ఏడు సెక్షన్లకు సంబంధించిన అధికారుల విచారణ..
- పీసీబీ సెక్షన్ కార్యాలయంలో ఉండాల్సిన ఫైల్స్ బయటకు వెళ్లడంపై ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCB Files Burning Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పీసీబీ ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. బెజవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. పీసీబీలో ఏడు సెక్షన్లకు సంబంధించిన అధికారులను విచారిస్తున్నారు.. పీసీబీ సెక్షన్ కార్యాలయంలో ఉండాల్సిన ఫైల్స్ బయటకు రావడంపై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు.. కార్యాలయంలో ఉండాల్సిన ఫైల్స్, హార్డ్ డిస్క్ లు బయటకు వెళ్లటంలో అధికారుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.. ఫైల్స్ లో ఉన్న అంశాలు, వాటి ప్రాధాన్యత గురించి స్టేట్ మెంట్స్ రికార్డు చేస్తున్నారు పోలీసులు.. శాఖ ఫైల్స్ బయటకు ఎలా వెళ్లాయి అనే అంశంపై అధికారులను పూర్తిస్థాయిలో ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Read Also: Ghazipur Triple Murder: ప్రేయసి కోసం 15 ఏళ్ల బాలుడి దారుణం.. తల్లిదండ్రులతో పాటు సోదరుడి హత్య..
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
ఇక, ఈ కేసు విచారణలో పోలీసులకి OSD రామారావు చుక్కలు చూపించినట్టుగా ప్రచారం సాగుతోంది.. ఆ డాక్యుమెంట్స్ పనికిరావని పోలీసులకి విచారణలో చెప్పారట రామారావు.. కానీ, ఆ ఫైల్స్ పడేయాలని చెప్పిన వారి గురించి మాత్రం రామారావు నోరు విప్పలేదట.. ప్రభుత్వ డాక్యుమెంట్స్ డిస్పోజ్ చేసేందుకు ఉన్న ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వలేదో కూడా రామారావు చెప్పలేదని తెలుస్తోంది.. పోలీసులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ లో కొన్ని పీసీబీ వెబ్ సైట్ లో ఓపెన్ డాక్యుమెంట్స్ గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.. ఇక, దహనం చేసేందుకు ప్రయత్నించిన ఫైల్స్ లో కీలకమైనవి ఏమన్నా ఉన్నాయా అనే గుర్తించే పనిలో పడిపోయారు పోలీసులు.. కాగా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దగ్ధం కేసు కలకలం రేపింది.. ఈ కేసులో ఓఎస్డీ ఎస్వీ రామారావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. సగం కాలిన రికార్డులు, హార్డ్ కాపీలను కూడా గన్నవరం తీసుకెళ్లారు పోలీసులు. ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘ కాలం పనిచేసిన రామారావుపై.. గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరోసారి ఫైల్స్ దగ్ధం ఘటనలో రామారావు పేరు రావడంపై ఎక్సైజ్ శాఖలో చర్చగా మారిన విషయం విదితమే.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?