Deputy CM Pawan Kalyan: అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి సారించాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు.. ఈ సమావేశంలో జూ పార్క్‌ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.. ఇక, జూ పార్క్ అభివృద్దికి కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేలా టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని సూచించారు.. పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి పెట్టండి. కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.. జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీలను భాగస్వాముల్ని చేయాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Poonam Kaur: త్రివిక్రమ్ నాకేం చేశాడో వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో అతన్నే అడగండి!