YCP Leaders Protest: బెజవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర వైసీపీ నేతలు నిరసన చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ నిరసన తెలిపారు.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కి వరద ప్రవాహం రోజురోజుకూ పెరిగిపోతుంది. పులిచింతల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్, పులిచింతల మధ్య క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వస్తుంది.
చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నేతన్నలు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేయగా.. స్టాళ్లల్లో ఉత్పత్తులను పరిశీలించి వారితో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ స్టాళ్లలో సతీమణి భువనేశ్వరి కోసం చీరలను కొనుగోలు చేశారు. చీరల గురించి అడిగి తెలుసుకుని మరీ రెండు చీరలను కొనుగోలు చేశారు సీఎం చంద్రబాబు. వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలను సీఎం కొనుగోలు చేశారు.
Kesineni Chinni: ఇవాళ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు కర్నూల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజుల్లో ఏసీఏలో ఎన్నికలు జరుగుతాయన్నారు.
మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది.. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకుంటే.. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్నారు వంశీ.. మరోవైపు.. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
పోలీసింగ్ కోసం సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. ఈ క్రమంలో ఇ-పహారా అప్లికేషన్ ను పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు ప్రారంభించారు.
SAPTA JYOTIRLINGA DARSHAN YATRA: తాజగా ఐఆర్సిటిసి భక్తులకోసం వారి భారత్ గౌరవ్ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర పేరుతో ఆగష్టు 17 – ఆగష్టు 28, 2024 న 11 రాత్రులు / 12 రోజులు జరగనుంది. ఈ టూర్ లో సందర్శన క్షేత్రాల విషయానికి వస్తే.. ఉజ్జయిని [మహకళేశ్వర్, ఓంకారేశ్వర్], ద్వారక [నాగేశ్వర్], సోమనాథ్ [సోమనాథ్], పూణే [భీమశంకర్], నాసిక్ [త్రయంబకేశ్వర్], ఔరంగాబాద్ [గ్రీశ్నేశ్వర్] లలో దర్శనాలను చేయించనున్నారు.…
South Central Railway: రైల్వేల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే లైన్ల ఆధునీకరణతో పాటు సింగిల్ లైన్ రూట్లను డబుల్ లైన్లుగా, డబుల్ లైన్ రూట్లను ట్రిపుల్ లైన్లుగా మార్చేందుకు పనులను చేపట్టారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో అమ్మవార్లు శాకంబరీ దేవీగా దర్శనం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారు జాము నుంచే భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ సర్వర్లు నిలిచిపోయాయి. దీనివల్ల పలు విమాన సర్వీసులు ఆలస్యం కాగా.. బోర్డింగ్ పాసులపై మాన్యువల్‌గా రాసి ప్రయాణికులను పంపిస్తున్నారు.