విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హైస్కూల్ మధరసా ( జామియా హైదయతుల్ వనాథ్ )లో ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న ( గురువారం ) రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 8 మందికి వాంతులు కావడంతో పాటు గుడివాడ అంగళూరు ప్రాంతానికి చెందిన కరిష్మా(17) అనే బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా నేటి ఉదయం 9 గంటల సమయంలో మృతి చెందింది.
విజయవాడ నగరంలోని బృందావన్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. సింధు భవన్ దగ్గర కిరాణా షాపు వ్యాపారి హత్య జరిగింది. వ్యాపారి కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది. సదరు యువకుడిని ఆ కిరాణం షాప్ యాజమాని మందలించడంతో దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.
Pawan Kalyan Meets Janasena MLA’s in Vijayawada: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నేడు తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలతో పవన్ సమావేశం అయ్యారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు, అసెంబ్లీ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలకు జనసేనాని అవగాహన కల్పించారు. వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్.. దీక్షా వస్త్రాలు ధరించి ఎమ్మెల్యేల అవగాహన…
Animal Smuggling : సముద్రగర్భంలో నివసించే సీ ఫ్యాన్స్ ను దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తెచ్చి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో నెలరోజులు పరిశీలన జరిపి నిందితుడు శ్రీనివాస్ ను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడటం దేశంలో మొదటిసారని చెబుతున్న పోలీసు అధికారులు. దాదాపు 900 సీ ఫ్యాన్స్ సీజ్చేసారు అధికారులు. నిందితుడు శ్రీనివాస్ ఒక్కొక్కటి ఫొటో ఫ్రేముల్లో పెట్టి లక్షల్లో అమ్మకాలు చేసినట్లుగా అధికారుల ఇన్వెస్టిగేషన్ లో వెల్లడయ్యాయి.…
Amaravati Farmers : ఆదివారం తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన రాజధాని రైతులు బయలుదేరారు. తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు రానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో తమ మొక్కులను రాజధాని గ్రామాల రైతులు చెల్లించుకోనున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు పొంగళ్ళు నెత్తిన, అమ్మవారు ఫోటో చేత్తో పట్టుకొని కాలినడకన విజయవాడ అమ్మవారి దేవస్థానానికి…
విజయవాడలోని బీసీ సంక్షేమ హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేశారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత. హాస్టల్లోని సదుపాయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మంత్రి ఆకస్మికంగా హాస్టల్కు వచ్చారు. స్టోర్ రూమ్, విద్యార్థుల వసతి గదులను మంత్రి పరిశీలించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు.
ఇకపై విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబయికి డైరెక్ట్ విమాన సర్వీస్లు నడవనున్నాయి. గన్నవరం నుండి ముంబైకి విమాన సర్వీసును ఎంపీలు బాలశౌరి, ఎంపీలు కేశినేని చిన్ని ప్రారంభించారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్లు గన్నవరం నుంచి ప్రారంభం అయ్యాయని ఎంపీ బాలశౌరి వెల్లడించారు.