వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కలిశారు. గురువారం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన వంశీ.. కష్ట కాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వంశీ ఆరోగ్య స్థితి గురించి వైఎస్ జగన్ ఆరా తీశారు. ఎప్పుడూ అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. వల్లభనేని వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు.
Also Read: YV Subba Reddy: ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు.. సాయంత్రం 7 తర్వాతే పోలింగ్..!
వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. కోర్డు రిమాండ్ విధించడంతో.. విజయవాడ సబ్ జైలులో 137 రోజులుగా రిమాండ్ ఖాదీగా ఉన్నారు. జైల్లో ఉన్న సమయంలోనే వంశీ అనారోగ్యం బారిన పడ్డారు. అన్ని కేసుల్లోనూ కోర్టులో ఊరట దక్కడంతో.. 137 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే వంశీని చూసి ఆయన సతీమణి పంకజశ్రీ ఎమోషనల్ అయ్యారు. ఈరోజు వైఎస్ జగన్‌ను వంశీ కలిశారు.