ఏపీ లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులు రిలీజ్ అయ్యారు. కీలక నిందితులు ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పలు ఈరోజు ఉదయం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు వద్ద 3 గంటల హైడ్రామా తర్వాత నిందితులు విడుదల అయ్యారు. అనంతరం ముగ్గురు నిందితులు తమ నివాసాలకు వెళ్లిపోయారు. విజయవాడ జైలు అధికారులు కావాలనే తమని ఆలస్యంగా విడుదల చేశారని నిందితులు తెలిపారు. లిక్కర్ స్కాం కేసులో…
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల బెయిల్ కాన్సిల్ చేయాలని ఏపీ హైకోర్టులో ప్రభుత్వం హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు హైకోర్టు అనుమతి కోసం ప్రాసిక్యూషన్ ఎదురు చూస్తున్నారు. మరోవైపు లిక్కర్ స్కాం నిందితులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్దమవుతున్నారు. ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చినా.. 3 గంటల పాటు జైలు అధికారులు అమలు చేయలేదని పిటిషన్ వేయటానికి రెడీగా…
విజయవాడ సబ్ జైలు వద్ద హైడ్రామా నెలకొంది. లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ ఇచ్చినా.. కావాలని విడుదల చేయటం లేదని న్యాయవాదుల ఆందోళనకు దిగారు. సబ్ జైలు ఎదురుగా బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఉద్ధేశపూర్వకంగానే విడుదల ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని విజయవాడ జైలు సూపరిటెండెంట్‌పై న్యాయవాదులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు సబ్ జైలులో నిందితులు కూడా ఆందోళన చేస్తున్నారు. బెయిల్ ఇచ్చినా విడుదల చేయకపోవటంతో జైలు లోపల…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కలిశారు. గురువారం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన వంశీ.. కష్ట కాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వంశీ ఆరోగ్య స్థితి గురించి వైఎస్ జగన్ ఆరా తీశారు. ఎప్పుడూ అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. వల్లభనేని వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. Also…
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విజయవాడ సబ్ జైలు వద్ద మరోసారి హంగామా సృష్టించారు. ఇప్పటికే రెండు రోజులు జైలు వద్ద చెవిరెడ్డి హంగామా చేయగా.. నేడు కూడా రచ్చ చేశారు. జైలు నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో సిట్ దర్యాప్తుపై చెవిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అవి నిలబడవన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారికి ఏదొకరోజు తప్పకుండా శిక్ష పడుతుందంటూ…
విజయవాడ సబ్ జైలు నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విడుదలయ్యారు.. ఫిబ్రవరి 16వ తేదీన హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన విజయవాడ పటమట పోలీసులు.. హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించారు.. వల్లభనేని వంశీని బెదిరింపులు, కిడ్నాప్ కేసులో అరస్ట్ చేసిన ఆ తర్వాత వరుసగా 11 కేసులు నమోదు అయ్యాయి..
వల్లభనేని వంశీ రెండు రోజుల కస్టడీ పూర్తి అయింది.. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నమోదైన కేసుకి సంబంధించి వంశీని రెండ్రోజుల పాటు పోలీసులు విచారించారు. వంశీని 30కిపైగా ప్రశ్నలు అడిగారు. నకిలీ ఇళ్ల పట్టాలను ఎక్కడ ఎవరు ఎందుకు తయారు చేసారని వంశీని పోలీసులు ప్రశ్నించారు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయాల్ని అడిగారు. తనకు నకిలీ పట్టాలతో సంబంధం లేదని వంశీ సమాధానం చెప్పారు.
వల్లభనేని వంశీ మోహన్ అస్వస్థతకు గురయ్యారు.. వెంటనే విజయవాడ సబ్ జైలు నుంచి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు.. బ్యాక్ పెయిన్, వాళ్లు వాయటంతో ఇబ్బంది పడుతోన్న వంశీని.. ఆస్పత్రికి తీసుకెళ్లారు జైలు అధికారులు.. బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు
వల్లభనేని వంశీ మోహన్‌కు అనారోగ్య సమస్యలు ఉన్నాయి.. ఒంటరిగా ఉంచి డిప్రెషన్‌కు గురయ్యేలా చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వంశీ భార్య పంకజ శ్రీ.. విజయవాడ సబ్ జైలులో ఉన్న వంశీని ఈ రోజు ములాఖత్‌లో కలిశారు పంకజ శ్రీ, వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పంకజ శ్రీ.. వంశీకి ఆస్తమా, ఫిట్స్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి.
విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీని ములాఖత్‌లో కలిశారు ఆయన భార్య పంకజ శ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. వంశీని కలిశాం.. కింద పడుకోవడం కొంచం ఇబ్బందిగా ఉంది.. గట్టు ఉన్న ప్రదేశం కేటాయించామని రిక్వస్ట్ చేశామని తెలిపారు పేర్ని నాని.. పరిపాలనలో ఉన్న రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం, మానసింకంగా ఆనంద పరచడం కోసం వైసీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు..