విజయవాడ సబ్ జైలు వద్ద హైడ్రామా నెలకొంది. లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ ఇచ్చినా.. కావాలని విడుదల చేయటం లేదని న్యాయవాదుల ఆందోళనకు దిగారు. సబ్ జైలు ఎదురుగా బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఉద్ధేశపూర్వకంగానే విడుదల ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని విజయవాడ జైలు సూపరిటెండెంట్‌పై న్యాయవాదులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు సబ్ జైలులో నిందితులు కూడా ఆందోళన చేస్తున్నారు. బెయిల్ ఇచ్చినా విడుదల చేయకపోవటంతో జైలు లోపల గేటు దగ్గర బాలాజీ గోవిందప్ప ఆందోళనకు దిగారు. డీఐజీ డౌన్ డౌన్ అంటూ నిందితులు నినాదాలు చేస్తున్నారు.
అడ్వకేట్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ… ‘నిన్న సాయంత్రం ఆర్డర్స్ వచ్చినా జైలు అధికారులు ఇంకా విడుదల చేయలేదు. నిన్న రాత్రి 8:30 వరకూ జైలు వద్ద ఎదురు చూశాం. ఈరోజు ఉదయం 6:30కు విడుదల చేస్తామని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. ఉదయం 6 గంటలకే మేం జైలు వద్దకు చేరుకున్నాం. జైలు సూపరింటెండెంట్ ఇప్పటి వరకూ అందుబాటులో లేరు. ఈ విషయంపై జైలు అధికారులు వింత సమాధానం చెబుతున్నారు. మచిలీపట్నం నుంచి సూపరింటెండెంట్ బస్సులో వస్తున్నారని చెబుతున్నారు. ఇది ఇల్లీగల్ కన్ఫైన్ మెంట్ కిందకు వస్తుంది. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళతాం’ అని చెప్పారు.
Also Read: Lunar Eclipse 2025: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 12 గంటల పాటు ఆలయం మూసివేత!
ఏపీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకునే అవకాశం ఉంది. లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురి బెయిల్ పిటిషన్లు కాన్సిల్ చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడానికి ప్రాసిక్యూషన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. కాసేపట్లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తారని సమాచారం. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.