Crime News: బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియో రికార్డ్, 8 మంది అరెస్ట్
- గౌహతిలోని ఓ ఆలయంలో బాలికపై సామూహిక అత్యాచారం
- ఈ కేసులో ఎనిమిది మంది అరెస్టు
- నవంబర్ 17న దుర్గ గుడి ఆవరణలో బాలికపై గ్యాంగ్ రేప్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసోం రాజధాని గౌహతిలోని ఓ ఆలయంలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారానికి గురైన బాలిక వివరాలు తెలియలేదని శనివారం పోలీసులు తెలిపారు. నవంబర్ 17న రాస్ మహోత్సవం సందర్భంగా దుర్గ గుడి ఆవరణలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పేర్కొన్నారు. నిందితుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉంటుందని.. నేరగాళ్లు అత్యాచారాన్ని మొబైల్‌లో చిత్రీకరించి పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. దాదాపు మూడు వారాల తర్వాత వీడియో బయటపడిందని పోలీసులు తెలిపారు.
Read Also: Minister Seethakka: మాకు ఎలాంటి కక్ష లేదు.. అల్లు అర్జున్ అరెస్ట్ పై సీతక్క కామెంట్
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ఈ ఘటనపై గౌహతి వెస్ట్ డీసీపీ పద్మనాభ్ బారువా మాట్లాడుతూ.. “తొమ్మిది మంది నిందితులలో ఎనిమిది మంది రాబిన్ దాస్, కుల్దీప్ నాథ్ (23), బిజోయ్ రభా (22), పింకు దాస్ (18), గగన్ దాస్ (21), సౌరవ్, బోరో (20), మృణాల్ రభా (19), దీపాంకర్ ముఖియా (21)లను అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని డీసీపీ తెలిపారు. కాగా.. గౌహతిలోని గోర్చుక్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అధికారి ధర్మేంద్ర కలితకు శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో వాట్సాప్‌లో గ్యాంగ్ రేప్ వీడియో వచ్చింది. ఈ క్రమంలో.. గౌహతిలోని బోరగావ్ ప్రాంతానికి చెందిన ముగ్గురు నిందితులను తొలుత అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. విచారణలో ఈ కేసులో ఉన్న ఇతర నిందితులను కూడా గుర్తించారు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై వర్మ సంచలనం..దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?
దీంతో.. నూన్‌మతి, జలుక్‌బరి తదితర ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఉదయం నాటికి ఏడుగురు నిందితులను అరెస్టు చేయగా.. ఇద్దరు పరారీలో ఉన్నారు. సాయంత్రానికి మరో నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో నిందితులు అసలు విషయాన్ని బయటపెట్టారు. నవంబర్ 17 సాయంత్రం, బాలిక రాస్ మహోత్సవం కోసం నిందితులలో ఒకరితో కలిసి ఆలయానికి వచ్చిందని చెప్పారు. మద్యం మత్తులో ఉన్న తొమ్మిది మంది నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని.. వీడియో రికార్డు చేశారని డీసీపీ తెలిపారు. మరోవైపు.. సోషల్ మీడియా వినియోగదారులకు వీడియో ఏదైనా సోర్స్ నుండి వస్తే ఎవరికీ పంపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోను షేర్ చేయడం నేరపూరిత చర్య అని, ఎవరైనా షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!