UP: పెళ్లి మండపంలో చిరుత పులి ప్రత్యక్షం.. హడలెత్తిపోయిన అతిథులు
- లక్నో పెళ్లి మండపంలో చిరుత పులి ప్రత్యక్షం
- హడలెత్తిపోయిన అతిథులు
- కొన్ని గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్
- చాకచక్యంగా పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు
- ఒకరికి గాయాలు.. వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ వివాహ మండపంలోకి చిరుత పులి ప్రవేశించింది. దీంతో పెళ్లి వాళ్లు.. బంధువులు హడలెత్తిపోయారు. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోగా.. చిరుత పులి ఎలా ప్రవేశించిందో.. ఏమో తెలియదు గానీ.. పెళ్లి వాళ్లను మాత్రం హడలెత్తించింది. లక్నోలోని పారాలోని బుద్ధేశ్వర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న ఎంఎం లాన్‌లో జరిగింది. భయాందోళనకు గురైన పెళ్లి వాళ్లు పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

Also Read
సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ మరియు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత పులిని పట్టుకోవడానికి ఆపరేషన్ ప్రారంభించారు. దీంతో వారిపై కూడా అమాంతంగా దాడి చేసింది. ఈ దాడిలో ఒక ఫారెస్ట్ అధికారి కూడా గాయపడ్డారు. ఈ పరిణామంతో అటవి శాఖ అధికారులు కూడా భయంతో పరుగులు తీశారు. మొత్తానికి కొన్ని గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి.. చాకచక్యంగా చిరుతపులిని బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
लखनऊ में एक शादी में तेंदुआ घुस आया… पुलिस वालों ने पकड़ने की कोशिश किया तो राइफल लेकर भाग गया…. इसमें सबसे मेहनत का काम कैमरामैन कर रहा है pic.twitter.com/a6RCi1HOyD
— Mohammad Imran (@ImranTG1) February 12, 2025
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!