Vidadala Rajini: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ను సోమవారం మధ్యాహ్నం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎయిమ్స్‌కు ఇవ్వాల్సిన బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేశామని తెలిపారు. రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ సిస్టం కోసం సుమారుగా రూ.50 కోట్లను ఖర్చు చేశామని మంత్రి విడదల రజినీ వెల్లడించారు. పొల్యూషన్ బోర్డ్, ఫారెస్ట్ డిపార్టుమెంట్ క్లియరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని పేర్కొన్నారు.…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు దక్కాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజినీ ఢిల్లీలో ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. ఏపీలో 80 శాతం హెల్త్ రికార్డులను డిజిటలైజేషన్ చేశామని తెలిపారు. కోట్లాదిమంది ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలను పెంచి వైద్య విద్యను బలోపేతం చేస్తున్నామని ఆమె చెప్పారు. 300కు పైగా ప్రొసీజర్లను చేర్చి…
Vidadala Rajini: ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 2023 నాటికి ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రిని ప్రారంభించబోతున్నట్లు ఆమె వెల్లడించారు. రూ. 700 కోట్లతో ఉద్దానంలో ఏర్పాటు చేస్తోన్న రక్షిత మంచినీటి పథకం 80 శాతం పూర్తయిందని.. రక్షిత మంచి నీటి పథకాన్ని వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. ఉద్ధానం కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా అని మంత్రి విడదల రజినీ ప్రశ్నించారు. బీసీల ద్రోహి…
Vidadala Rajini: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద మంత్రులపై జరిగిన దాడి ఘటనపై మంత్రి విడదల రజినీ స్పందించారు. జనసేన కార్యకర్తలు కావాలనే మంత్రులపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని ఎన్టీవీతో చెప్పారు. ఒకవేళ తాము జనవాణిని అడ్డుకోవాలని భావిస్తే ఇప్పటివరకు నాలుగు జనవాణిలు జరిగి ఉండేవి కావన్నారు. నిన్న ఎయిర్ పోర్ట్ దగ్గర ట్రాఫిక్‌లో తాను ఇరవై నిమిషాలు ఇరుక్కుపోయానని.. జనసేన కార్యకర్తలు తన కారు చుట్టూ చేరి…
Vidadala Rajini: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి విడదల రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి మూడు రాజధానుల అవసరాన్ని సీఎం జగన్ ఇప్పటికే చెప్పారని.. అయినా చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని విడదల రజినీ వ్యాఖ్యానించారు. తమకు రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని.. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు త్వరలో మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తే చంద్రబాబే…
విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబుపై తన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
Vidadala Rajini: ఏపీ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి విడదల రజినీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సెప్టెంబర్ 1 నుంచి బయోమెట్రిక్ హాజరును అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అన్ని స్థాయిల సిబ్బందికి ప్రత్యేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హులైన ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందేలా చూడాలని, ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి విడదల రజినీ ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఆయుష్…