జగన్ హయాంలోనే వైద్యరంగానికి మంచి రోజులు వచ్చాయన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని. మంగళగిరి ఎయిమ్స్ పై మొన్న చంద్రబాబు మాట్లాడితే ఈ రోజు ఆపత్రికలో చుక్కలు చూపిస్తున్నారంటూ రాశారు. ఎయిమ్స్ పై ఆ పత్రికవారు దుష్ర్పచారం చేస్తున్నారు. ముందు చంద్రబాబు మాడ్లాడతారు…తర్వాత ఆ పత్రికలో రాస్తారు. ఆ తర్వాత చంద్రబాబు మళ్లీ ట్వీట్ చేస్తారు. ఎయిమ్స్ పై అసలు ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఏ సంస్ధ ఏర్పాటు చేయాలన్నా మౌలిక సదుపాయాలు ఉండాలి.2019 మార్చిలో మంగళగిరిలో ఎయిమ్స్ ప్రారంభమైంది. ఎయిమ్స్ లో మంచినీటి సమస్యపై తాత్కాలిక చర్యలు తీసుకున్నాం.
Read Also: Govt Bans YouTube Videos: భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం.. యూట్యూబ్ ఛానెల్స్ బ్యాన్
2 నుంచి 3 లక్షల లీటర్ల నీటిని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల నుంచి అందజేస్తున్నాం. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ నుంచి డిమాండ్ కి తగినట్టుగా అదనంగా మరో మూడు లక్షల లీటర్ల మంచినీటి సరఫరా చేస్తున్నాం. ఎయిమ్స్‌లో మంచినీటి సమస్యకి శాశ్వత పరిష్కారంకి చర్యలు చేపట్టామన్నారు మంత్రి విడదల రజని. భవిష్యత్ లో రోజుకి 25 లక్షల నీటి అవసరాన్ని గుర్తించి 534 జిఓ ఇచ్చి 26 జులై 2022 న రూ.7.74 కోట్లతో టెండర్లు పిలిచాం.ప్రస్తుతం టెండర్ ప్రాసెస్ పూర్తి అయింది. ఒకవైపు శాశ్వత ప్రాతిపదికన ఎయిమ్స్ సమస్యపై చర్యలు తీసుకున్నాం అన్నారు. ఎయిమ్స్‌కి పది కోట్ల ఖర్చుతో రోడ్ కనెక్టివిటీని జగనన్న ప్రభుత్వం చేసింది.
35 కోట్లతో 132 కెవి సబ్ స్టేషన్‌ని కూడా మా ప్రభుత్వమే నిర్మించింది. ఎయిమ్స్ నుంచి వచ్చిన అన్ని విజ్ణప్తులని పరిగణనలోకి తీసుకుంటున్నాం. 2019లో గత ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు లేకుండా ఎయిమ్స్ ప్రారంభించింది. ఆ రోజు అసలు నిజాలు ఎందుకు రాయలేదు??అటవీ క్లియరెన్స్, పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ పై కూడా మా ప్రభుత్వమే కృషి చేసింది. ఈ దుష్ట చతుష్టయం చేసే దుష్ప్రచారాలని ప్రజలెవ్వరూ నమ్మరు. జగనన్న ప్రభుత్వంలోనే ఎయిమ్స్ కి న్యాయం జరిగిందని వివరించారు మంత్రి విడదల రజని.
Read Also: Sreenath Bhasi: బ్రేకింగ్.. మలయాళ స్టార్ హీరో అరెస్ట్