ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగు చిత్రసీమలో వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ విజయయాత్ర చేసిన స్టార్ హీరో వెంకటేశ్ అనే చెప్పాలి… తొలి నుంచీ వరైటీ రోల్స్ లో అలరిస్తూ సక్సెస్ రూటులో సాగుతున్నారాయన… కొన్నిసార్లు ట్రాక్ తప్పినా, మళ్ళీ వైవిధ్యంతోనే విజయపథాన్ని చేరుకుంటున్నారు… కాలానికి అనుగుణంగా సాగుతున్నారు వెంకటేశ్… నవతరం స్టార్స్ తోనూ జోడీ కడుతూ వినోదం పండిస్తున్నారు… మరోవైపు తన వయసుకు తగ్గ పాత్రలతో ఓటీటీలోనూ సందడి చేస్తున్నారు… ఆ తీరున సాగుతున్న…
ఎన్నో తెలుగు చిత్రాలకు అద్భుతమైన పాటలను అందించిన గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. న్యూమోనియాతో బాధపడుతున్నా ఆయన ఈ నెల 24న కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల మృతిపై ప్రముఖ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేశ్ స్పందిస్తూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక…
ఇటీవల ‘వరుడు కావాలెను’తో హిట్ కొట్టిన నాగశౌర్య తదుపరి ‘లక్ష్య’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి పతాకంపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు. కేతికా శర్మ హీరోయిన్ గా…
విక్టరీ వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ‘దృశ్యం 2’ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ ‘దృశ్యం’కు సీక్వెల్‌గా ఈ చిత్రం నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది. తొలుత వెంకటేశ్ మాట్లాడుతూ, ” ఇవాళ ‘దృశ్యం 2’ ట్రైలర్ లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ‘దృశ్యం’ తర్వాత అలాంటి సినిమా…
విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలు పోషించిన ‘దృశ్యం-2’ సినిమా ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. మలయాళం మూవీ దృశ్యం-2 మూవీకి ఇది రీమేక్‌గా తెరకెక్కింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రాగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా సస్పెన్స్ అంశాలతో ఆకట్టుకుంటోంది. పోలీస్ ఆఫీసర్ కుమారుడు వరుణ్ హత్య తర్వాత ఏమైందనే కథ చుట్టూ ఈ సినిమాను తెరకెక్కించారు. రాంబాబు సినిమా థియేటర్ కట్టుకుని హాయిగా జీవిస్తున్న తరుణంలో…
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన “లవ్ స్టోరీ” సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 19న జరగనుండగా.. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. అక్కినేని నాగార్జున కూడా ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారు. ఇక ఇటీవలే విడుదలైన ‘లవ్…
విక్టరీ వెంకటేశ్ కు షష్ఠి పూర్తి అయ్యింది. అయినా యంగ్ ఛార్మ్ తగ్గకపోవడంతో హీరోగా రాణిస్తూనే ఉన్నారు. మరీ కాలేజీ స్టూడెంట్ పాత్రలు చేయకపోయినా… తన వయసును దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ మ్యాన్ పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేశ్ పిల్లలు సినిమా వాతావరణానికి దూరంగా ఉంటారు. ఆయన కుమార్తె ఆశ్రిత వరల్డ్ ఫేమస్ వంటలు చేయడంలో దిట్ట. ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తోందామె. తరచూ అందులో సరికొత్త వంటల వివరాలు అప్…
(సెప్టెంబర్ 5న ‘సూర్య ఐపీఎస్’ కు 30 ఏళ్ళు) వెంకటేశ్, విజయశాంతి కలసి నటించిన ‘శత్రువు’ ఘనవిజయం సాధించింది. ఆ సినిమా తరువాత వారిద్దరూ జోడీగా నటించిన ‘సూర్య ఐపీఎస్’ చిత్రం జనం ముందు నిలచింది. ఈ చిత్రానికి ఎ.కోదండరామిరెడ్డి దర్శకుడు. వెంకటేశ్, కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఇదే. దీని తరువాత ‘పోకిరి రాజా’ వచ్చింది. ఈ రెండు చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. వాటిలో ‘సూర్య ఐపీఎస్’ ఫరవాలేదని చెప్పవచ్చు. టి.సుబ్బరామిరెడ్డి నిర్మించిన ఈ…
తమిళ ‘అసురన్’కు తెలుగు రీమేక్ ‘నారప్ప’. అక్కడ ధనుష్ కథానాయకుడు కాగా, ఇక్కడ వెంకటేశ్ హీరోగా నటించారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో దగ్గుబాటి సురేశ్ బాబు, కలైపులి ఎస్ థాను దీన్ని నిర్మించారు. మే 14న థియేటర్లలో రిలీజ్ చేయాలని మొదట భావించినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడటంతో తప్పని స్థితిలో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. ‘వి’, ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాలు కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఓటీటీలో…
(జూలై 12తో ‘కూలీ నంబర్ 1’కు 30 ఏళ్ళు) కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘కలియుగ పాండవులు’ చిత్రం ద్వారా హీరోగా జనం ముందు నిలిచారు వెంకటేశ్. తొలి సినిమా సక్సెస్ తోనే ‘విక్టరీ’ వెంకటేశ్ గా జనం మదిని గెలిచారు. ఆ తరువాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేశ్ “భారతంలో అర్జునుడు, ఒంటరి పోరాటం, కూలీ నంబర్ వన్” చిత్రాలలో నటించారు. వీటి తరువాత “ముద్దుల ప్రియుడు, సాహసవీరుడు-సాగరకన్య, సుభాష్ చంద్రబోస్” చిత్రాలలోనూ రాఘవేంద్రరావు, వెంకటేశ్ కాంబో సాగింది. అయితే…