జేఎన్‌టీయూహెచ్ కొత్త వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ కె. విజయకుమార్ రెడ్డి (డైరెక్టర్), డాక్టర్ కె. వెంకటేశ్వరరావు (రిజిస్ట్రార్), వివిధ విభాగాల డైరెక్టర్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
జేఎన్టీయూ కొత్త ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్గా నియమితులైన బుర్రా వెంకటేశం నేడు జేఎన్టీయూని సందర్శించారు. వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లో డైరెక్టర్ కె. విజయకుమార్ రెడ్డి, రిజిస్టార్ కె. వేంకటేశ్వరావుల సమక్షంలో యూనివర్సిటీలోని డైరెక్టర్లను, కాలేజ్ ప్రిన్సిపాల్, క్యాంపస్ కాలేజీలోని పలు డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఆచార్య వర్గాన్ని, ఆయా డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు, ఇంచార్జ్ వైస్ ఛాన్స్లర్కు రిజిస్టార్ పరిచయం చేశారు.
IIIT Student: బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే విద్యార్థిని మృతి చెందిన ఘటన మరవకముందే మరో విద్యార్థిని లిఖిత మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. ట్రిపుల్ ఐటీ లోనే విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జేఎన్టీయూ విద్యార్ధుల ఆందోళనను తాను వీసీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. జేఎన్‌టీయూ విద్యార్ధుల ఆందోళన విషయమై తాను వీసీతో మాట్లాడినట్టుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. ఈ విషయమై తనతో చర్చించేందుకు వీసీ రాజ్ భవన్ కు రెండు దఫాలు వచ్చారని ఆమె గుర్తు చేశారు.
జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలరుగా తిరిగి రామలింగరాజును నియమించారు గవర్నర్ హరిచందన్. గత మే నెలలో రామలింగరాజును ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించింది. వీసీ బాధ్యతలను ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రకు బాధ్యతలు అప్పగించింది. అయితే రామలింగరాజు తొలగింపుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు స్టేతో తిరిగి రామలింగరాజును వీసీగా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసారు గవర్నర్ హరిచందన్.
ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా నియామకం కావడంపై స్పందించారు కరణం మల్లీశ్వరి “ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ” తొలి వైస్ ఛాన్సలర్‌గా నియామకంపై ఆనందంగా ఉందని.. ఇంకా భవన నిర్మాణం, మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. ఓ 10 పదేళ్లలో దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి గుర్తింపు తీసుకుచ్చే మంచి క్రీడాకారులు ఈ విశ్వవిద్యాలయం నుంచి తయారయ్యేవిధంగా కృషి చేస్తానని తెలిపారు. దేశంలో రెండు, మూడు దశాబ్దాల క్రితం కంటే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే మౌలిక…
తెలుగు తేజం, ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరికి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమించింది ప్రభుత్వం.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని ఢిల్లీలో తొలిసారి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర సర్కార్… ఆ వర్సిటీ తొలి వీసీగా కరణం మల్లేశ్వరికి అవకాశం దక్కింది.. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్‌గా ఏపీకి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది…
నాగార్జున వర్సిటీ వీసీ రాజశేఖర్ పై మరోసారి విచారణ కమిటీ నియామకం చేసారు. రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై కమిటీ ఏర్పాటు చేసారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆరోపణలపై విశ్రాంత ఐఏఎస్‌తో కమిటీ ఏర్పడింది. ఆరోపణలు వాస్తవమేనని గతంలో ప్రభుత్వానికి చక్రపాణి కమిటీ నివేదిక అందించింది. ప్రభుత్వం మారడంతో చక్రపాణి కమిటీ నివేదికపై చర్యలు నిలిపేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న రాజశేఖర్ కు పూర్తిస్థాయి అదనపు వీసీగా బాధ్యతలు అప్పగించారు. రాజశేఖర్ కు బాధ్యతలు…