Governor Tamilisai: జేఎన్‌టీయూ విద్యార్ధుల ఆందోళనను తాను వీసీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. జేఎన్‌టీయూ విద్యార్ధుల ఆందోళన విషయమై తాను వీసీతో మాట్లాడినట్టుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. ఈ విషయమై తనతో చర్చించేందుకు వీసీ రాజ్ భవన్ కు రెండు దఫాలు వచ్చారని ఆమె గుర్తు చేశారు. సబ్జెక్టు మినహయింపులో ఇబ్బందులు విద్యార్ధులకు జరిగే నష్టాన్ని వీసీ వివరించారని చెప్పారు. జేఎన్‌టీయూ విద్యార్థుల ఆందోళనలను వీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. జేఎన్‌టీయూ విద్యార్థుల ఆందోళనపై వీసీతో మాట్లాడినట్లు గవర్నర్ తమిళిసై తెలిపారు. ఈ విషయమై తనతో చర్చించేందుకు వీసీ రెండుసార్లు రాజ్‌భవన్‌కు వచ్చారని ఆమె గుర్తు చేశారు. సబ్జెక్టు మినహాయింపులో ఇబ్బందుల వల్ల విద్యార్థులకు జరిగిన నష్టాన్ని వీసీ వివరించారు. సబ్జెక్ట్ మినహాయింపు సాధ్యం కాదని వీసీ తేల్చిచెప్పారన్నారు. అయితే విద్యార్థుల గ్రేస్ మార్కులు పెంచే అవకాశం ఉందని వీసీ చెప్పారని గవర్నర్ వివరించారు. ఆమె కోరిక మేరకు గ్రేస్ మార్కులు పెంచినట్లు తెలిపారు. విద్యార్థులు తగిన శ్రద్ధతో, ఆశావాద దృక్పథంతో ముందుకు సాగాలని గవర్నర్ కోరారు.
Read also: Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో తీర్పు వాయిదా
బీటెక్ విద్యార్థులకు సబ్జెక్ట్ మినహాయింపు విఫయంలో JNTU కీలక నిర్ణయం తీసుకుంది. (2018)ఆర్18 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఈ ఏడాదితో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నారు. అయితే.. బ్యాక్‌ల్యాగ్స్ ఉన్న వారందరూ సబ్జెక్టు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వర్సిటీ ఎదుట ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా పెద్దసంఖ్యలో ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తూవచ్చారు ఇదే విషయంపై ఇటీవలె గవర్నర్ తమిళసైని కలిసి వినిపత్రం కూడా అందజేశారు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం 152-160 మధ్య క్రెడిట్స్ ఉంటే సరిపోతుందని, జేఎన్‌టీయూ మాత్రం 160 ఉండాల్సిందే అంటోందని గవర్నర్ కు వివరించారు. స్పందించిన గవర్నర్ రెండుసార్లు జేఎన్‌టీయూ ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డిని పిలిపించి చర్చించారు. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేలా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఇక, సబ్జెక్టు మినహాయింపుపై తాజాగా వర్సిటీలో అకడమిక్ సెనేట్ భేటీ అయిన.. ఆతరువాత పాలకమండలి సమావేశంలోనూ అధికారులు చర్చించిన విషయం తెలిసిందే.
Shankar- Ranveer Singh: రణ్ వీర్ సింగ్ తో శంకర్ ‘వేల్ పరి’ ట్రయాలజీ