Police Complaint Song: వరలక్ష్మి-నవీన్ చంద్ర క్యూట్ లవ్ సాంగ్.. యూత్‌కు ఆకట్టుకుంటున్న ప్రేమగీతం!
- ‘పోలీస్ కంప్లైంట్’ నుంచి లవ్ సాంగ్
- 'ప్రేమ ఓ ప్రేమ' సాంగ్ రిలీజ్
- యూత్‌కు ఆకట్టుకుంటున్న ప్రేమగీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, టాలీవుడ్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. హారర్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందింది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ క్లీన్ సర్టిఫికెట్ పొందింది. త్వరలోనే పోలీస్ కంప్లైంట్ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఓ నుంచి క్యూట్ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
వరలక్ష్మి–నవీన్ చంద్ర జంటపై చిత్రీకరించిన మెలోడియస్ సాంగ్ ‘ప్రేమ ఓ ప్రేమ’ను సీనియర్ జర్నలిస్ట్ ప్రభు విడుదల చేశారు. ఈ పాటను అన్విక ఆడియోస్ ద్వారా ఆవిష్కరించారు. ఈ ప్రేమ గీతానికి సుధాకర్ మారియో సంగీతం సమకూర్చారు. భవ్యశ్రీ, సాత్విక్ ఆలపించారు. ఈ పాట యూత్‌కు విపరీతంగా నచ్చుతుందని, ట్రెండింగ్‌లో నిలుస్తుందని, సూపర్ హిట్ లవ్ సాంగ్స్ జాబితాలో చోటు సంపాదిస్తుందని దర్శకుడు సంజీవ్ మేగోటి ధీమా వ్యక్తం చేశారు. ప్రేమ, భావోద్వేగాలు మేళవించిన ఈ గీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.
Also Read
‘పోలీస్ కంప్లైంట్’ చిత్రంలో యాక్షన్, కామెడీ, రొమాన్స్ అంశాలను మేళవిస్తూ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించేలా చిత్రాన్ని రూపొందించినట్టు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, కృష్ణ సాయి, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, పృథ్వి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్ఎన్ హరీష్ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, డ్రాగన్ ప్రకాష్–రవితేజ రూపొందించిన ఫైట్స్ హైలైట్ అవుతాయని చిత్ర యూనిట్ వెల్లడించింది.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!