విక్టరీ వెంకటేశ్ సైతం వెబ్ సీరిస్ కు సై అనేశారు. ఇప్పటికే ఆయన ‘నారప్ప’ మూవీ ఓటీటీలో విడుదలైంది. త్వరలో రానాతో కలిసి వెంకటేశ్ నటిస్తున్న ‘రానా నాయుడు’ అనే వెబ్ సీరిస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బుధవారం వెలువడింది. అమెరికన్ పాపులర్ క్రైమ్ డ్రామా ‘రే డొనోవన్’ సీరిస్ ను అడాప్ట్ చేసుకుని ‘రానా నాయుడు’ను నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించింది. గతంలో రానా నటించిన ‘కృష్ణం…
‘జాతి రత్నాలు’ తో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అనుదీప్. కామెడీతో కబడ్డీ ఆడిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకున్న అనుదీప్ ని ఆ సినిమా సక్సెస్ తర్వాత పలు ఆఫర్స్ పలకరించాయి. అయితే తన తదుపరి సినిమాపై ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వని అనుదీప్ ఇటీవల టాప్ హీరో వెంకటేశ్ కి కథ వినిపించాడట. మన స్టార్ హీరోలలో కామెడీ పండించటంలో ముందుంటాడు వెంకీ. Read Also : కీర్తి సురేష్,…
ఇటీవల “నారప్ప” సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సీనియర్ హీరో వెంకటేష్ ఈ ఏడాది మరో సినిమాతో అలరించడానికి సిద్ధమయ్యాడు. “నారప్ప” నేరుగా ఓటిటిలో విడుదల కాగా, ఆయన నటిస్తున్న తాజా చిత్రం “దృశ్యం 2” ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న”దృశ్యం 2″లో వెంకటేష్ భార్యగా మీనా నటిస్తుండగా, కృతిక, ఎస్తేర్ అనిల్ వారి కూతుర్లుగా కనిపించనున్నారు. మొదటి భాగం “దృశ్యం” బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కావడంతో చాలా మంది “దృశ్యం…
విక్టరీ వెంకటేష్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇటీవల విడుదలైన “నారప్ప” ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వడం దగ్గుబాటి అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుందని ఆశించిన వెంకీమామ అభిమానులకు అలా నిరాశ తప్పలేదు. తాజాగా మరోమారు వెంకటేష్ తన అభిమానులను నిరాశ పరిచారు. “దృశ్యం” చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకున్న…
వెంకటేష్ దగ్గుబాటి ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూవీ రిలీజ్‌లతో దూసుకుపోతున్నారు. ఆయన ఇటీవల విడుదల చేసిన “నారప్ప” సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఎలాంటి పాత్రనైనా ఈజీగా పోషించగల అరుదైన నటులలో వెంకటేష్ ఒకరు. ఆయన ఇప్పుడు 2014 ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ “దృశ్యం” సీక్వెల్‌గా రాబోతున్న మూవీ “దృశ్యం 2″తో ప్రేక్షకులను అలరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. Read Also : శ్రీకాళహస్తిలో సమంత వరుస పూజలు ! వెంకటేష్ ఈ…
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్3’.. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సీక్వెల్ చిత్రంలో ఈసారి సునీల్, అలీ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా.. తాజాగా ‘ఎఫ్3’ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సెట్లో జరిగిన సరదా సన్నివేశాలను ‘ట్రిపుల్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అంటూ వీడియో విడుదల…
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన “లవ్ స్టోరీ” సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 19న జరగనుండగా.. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. అక్కినేని నాగార్జున కూడా ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారు. ఇక ఇటీవలే విడుదలైన ‘లవ్…
ఇటీవలే ‘నారప్ప’ ను ఓటీటీలోకి తీసుకొచ్చిన విక్టరీ వెంకటేష్.. ఇప్పుడు ‘దృశ్యం 2’ విడుదలపై దృష్టిపెట్టారు. ఈ సినిమా కూడా ఓటీటీలోనే వస్తుందని.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+హాట్ స్టార్ కొనుగోలు చేసిందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సమాచారం మేరకు దృశ్యం 2 థియేటర్లోకి రానుందని తెలుస్తోంది. ఈమేరకు ఓటీటీ డీల్ ను బ్రేక్ చేసారని సమాచారం. ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.…
లండన్‌లో దాదాపు రెండు రోజుల పదమూడు గంటల పాటు సంగీతంలోని ఎంతో విశిష్టమైన 72 మేళకర్త రాగాలను పలికించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వంటి అత్యున్నతమైన అవార్డును అందుకున్న ప్రముఖ సంగీత దర్శకులు స్వర వీణాపాణి. ‘పట్టుకోండి చూద్దాం’, ‘ దేవస్థానం’, ‘మిథునం’ వంటి చక్కని చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. ఆయన పెద్ద కుమార్తె మారుతీ సాయిలక్ష్మీ వివాహం భాను రాజీవ్‌తో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ వివాహ…
దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహించిన “అన్నాబెల్లె సేతుపతి” హారర్ థ్రిల్లర్ లో విజయ్ సేతుపతి, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో నటించారు. రాధికా శరత్‌కుమార్, రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. “అన్నాబెల్లె సేతుపతి” సినిమాలో విజయ్ సేతుపతి మరియు తాప్సీ పన్నూ మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ జైపూర్‌లో జరిగింది. ఒక నెలలోపే షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ…