వెంకటేష్ తాజా చిత్రం “దృశ్యం 2” వచ్చే వారం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. నవంబర్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ప్రమోషన్లు కూడా ప్రారంభించారు. సినిమా గురించి దగ్గుబాటి ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోబోతోందని సమాచారం. దిగ్గజ ఓటిటి సంస్థ “దృశ్యం 2” మేకర్స్ ను ఇబ్బందుల్లోకి నెట్టబోతోందట. Read also : పిరికిపంద చర్య… కేంద్రంపై కంగనా ఫైర్…
మరికొద్ది రోజుల్లో ఓటీటీ ప్రీమియర్‌కి సిద్ధమైన “దృశ్యం 2” సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. ఈ సినిమా తర్వాత హీరో వెంకటేష్ “ఎఫ్3″లో కనిపించనున్నారు. ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ మొదట సంక్రాంతి పండుగకు విడుదల కానుందని ప్రకటించారు. అయితే ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ కూడా సంక్రాంతికి విడుదల కానుండడంతో ‘ఎఫ్ 3’ ఇంత తీవ్రమైన పోటీ మధ్య థియేటర్లలోకి వస్తుందా అనే సందేహాలు నెలకొన్నాయి. Read…
విక్టరీ వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ‘దృశ్యం 2’ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ ‘దృశ్యం’కు సీక్వెల్‌గా ఈ చిత్రం నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది. తొలుత వెంకటేశ్ మాట్లాడుతూ, ” ఇవాళ ‘దృశ్యం 2’ ట్రైలర్ లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ‘దృశ్యం’ తర్వాత అలాంటి సినిమా…
వెంకీ మామ మళ్ళీ అదే బాట పట్టాడు. ఇంతకు ముందే అభిమానులు వద్దంటే వద్దని వేడుకున్న పనినే మళ్ళీ చేస్తున్నాడు. మరోసారి అభిమానులకు నిరాశను కలిగిస్తూ తన నెక్స్ట్ మూవీని ఓటిటిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. దగ్గుబాటి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న “దృశ్యం 2” మూవీ విడుదల తేదీని తాజాగా టీజర్ తో పాటు రివీల్ చేశారు మేకర్స్. అందులో నవంబర్ 25న “దృశ్యం 2” దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ లో విడుదల కానుంది…
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ చిత్రాన్ని వెంకటేశ్… నటి, దర్శకురాలు శ్రీపియ దర్శకత్వంలో గతంలో రీమేక్ చేశారు. ఆ తర్వాత మోహన్ లాల్ ‘దృశ్యం -2’ చేశారు. దీనిని కూడా తెలుగులో రీమేక్ చేయాలని భావించిన వెంకటేశ్, మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసఫ్ నే ఈసారి ఎంపిక చేసుకున్నారు. సినిమా షూటింగ్ సైతం చకచకా జరిగిపోయింది. థియేటర్లలో లేదంటే ఓటీటీలో అయినా విడుదల చేయాలని నిర్మాత సురేశ్ బాబు ఫిక్స్ అయిపోయారు. కానీ అదే…
2019 బ్లాక్ బస్టర్ ‘ఎఫ్2’కి సీక్వెల్ గా వస్తున్న ‘ఎఫ్3’కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సునీల్, రాజేంద్రప్రసాద్, సోనాల్ చౌహాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని ఇటీవలే విడుదల తేదీని ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.…
కర్ణాటక రాజధాని బెంగుళూరు కంఠీరవ స్టేడియానికి ఒక్క ఒక్కరు గా సినీ ప్రముఖులు చేరుకున్నారు. తాజాగా పునీత్ రాజ్ కుమార్ భౌతిక ఖాయాన్ని సందర్శించారు టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్. కాసేపటి క్రితమే.. పునీత్ రాజ్ కుమార్ వారిద్దరూ నివాళులు అర్పించారు. చిరంజీవి, వెంకటేష్ తో పాటు హీరో శ్రీకాంత్, ఆలీ కూడా పునీత్ కు నివాళులు అర్పించారు. కాగా.. కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం నేపథ్యంలో సౌత్ ఇండియన్…
2022 సంక్రాంతి సీజన్ లో సినిమాలను విడుదల చేయడానికి ఇప్పటికే నలుగురు హీరోలు సిద్ధమయ్యారు. “ఆర్ఆర్ఆర్” జనవరి 7న విడుదల కానుండగా, ‘భీమ్లా నాయక్’ జనవరి 12న, ‘సర్కారు వారి పాట’ జనవరి 13న, ‘రాధే శ్యామ్’ జనవరి 14 తేదీల్లో విడుదల కానుంది. మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ఎఫ్3” సంక్రాంతికి విడుదలవుతుందని అంతా భావిస్తుండగా, తాజాగా మేకర్స్ ప్రకటనతో ఈ మూవీ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టమైంది. 2019 బ్లాక్ బస్టర్ ‘ఎఫ్2’కి…
వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోర్ ఫన్ రైడర్ ‘ఎఫ్3’ షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా భారీ వసూళ్లను సాధించిన ‘ఎఫ్2’ చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.…
(అక్టోబర్ 17న ‘పవిత్ర బంధం’కు 25 ఏళ్ళు)తెలుగు చిత్రసీమలో ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసిన జంటల్లో వెంకటేశ్ – సౌందర్య జోడీనీ తప్పకుండా చేర్చాలి. వారిద్దరూ కలసి నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ బరిలో బంపర్ హిట్స్ గా నిలిచాయి. వాటిలో ‘పవిత్రబంధం’ ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో సి.వెంకట్రాజు, జి. శివరాజు నిర్మించిన ఈ చిత్రంలో ‘కాంటాక్ట్ మ్యారేజ్’ అన్నది ప్రధానాంశం. 1996 అక్టోబర్ 17న దసరా కానుకగా విడుదలైన ‘పవిత్ర బంధం’ ఘనవిజయం సాధించింది.…