వెంకటేష్ దగ్గుబాటి ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూవీ రిలీజ్‌లతో దూసుకుపోతున్నారు. ఆయన ఇటీవల విడుదల చేసిన “నారప్ప” సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఎలాంటి పాత్రనైనా ఈజీగా పోషించగల అరుదైన నటులలో వెంకటేష్ ఒకరు. ఆయన ఇప్పుడు 2014 ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ “దృశ్యం” సీక్వెల్‌గా రాబోతున్న మూవీ “దృశ్యం 2″తో ప్రేక్షకులను అలరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. Read Also : శ్రీకాళహస్తిలో సమంత వరుస పూజలు ! వెంకటేష్ ఈ…
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్3’.. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సీక్వెల్ చిత్రంలో ఈసారి సునీల్, అలీ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా.. తాజాగా ‘ఎఫ్3’ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సెట్లో జరిగిన సరదా సన్నివేశాలను ‘ట్రిపుల్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అంటూ వీడియో విడుదల…
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన “లవ్ స్టోరీ” సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 19న జరగనుండగా.. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. అక్కినేని నాగార్జున కూడా ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారు. ఇక ఇటీవలే విడుదలైన ‘లవ్…
ఇటీవలే ‘నారప్ప’ ను ఓటీటీలోకి తీసుకొచ్చిన విక్టరీ వెంకటేష్.. ఇప్పుడు ‘దృశ్యం 2’ విడుదలపై దృష్టిపెట్టారు. ఈ సినిమా కూడా ఓటీటీలోనే వస్తుందని.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+హాట్ స్టార్ కొనుగోలు చేసిందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సమాచారం మేరకు దృశ్యం 2 థియేటర్లోకి రానుందని తెలుస్తోంది. ఈమేరకు ఓటీటీ డీల్ ను బ్రేక్ చేసారని సమాచారం. ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.…
లండన్‌లో దాదాపు రెండు రోజుల పదమూడు గంటల పాటు సంగీతంలోని ఎంతో విశిష్టమైన 72 మేళకర్త రాగాలను పలికించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వంటి అత్యున్నతమైన అవార్డును అందుకున్న ప్రముఖ సంగీత దర్శకులు స్వర వీణాపాణి. ‘పట్టుకోండి చూద్దాం’, ‘ దేవస్థానం’, ‘మిథునం’ వంటి చక్కని చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. ఆయన పెద్ద కుమార్తె మారుతీ సాయిలక్ష్మీ వివాహం భాను రాజీవ్‌తో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ వివాహ…
దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహించిన “అన్నాబెల్లె సేతుపతి” హారర్ థ్రిల్లర్ లో విజయ్ సేతుపతి, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో నటించారు. రాధికా శరత్‌కుమార్, రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. “అన్నాబెల్లె సేతుపతి” సినిమాలో విజయ్ సేతుపతి మరియు తాప్సీ పన్నూ మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ జైపూర్‌లో జరిగింది. ఒక నెలలోపే షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ…
వెంకటేష్ దగ్గుబాటి డిజిటల్ ప్రపంచంలోకి అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ సరైన స్క్రిప్ట్ కోసం వేటను ప్రారంభించింది. ఈ వెబ్ డ్రామాలో వెంకటేష్, రానా దగ్గుబాటితో కలిసి పని చేస్తారని టాక్ వినబడుతోంది. ఈ మల్టీస్టారర్ ను ముందుగా హిందీలో చిత్రీకరించి, తరువాత అన్ని భారతీయ భాషల్లోకి డబ్ చేస్తారు. రాబోయే హిందీ వెబ్ డ్రామాను నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడే…
(ఆగస్టు 14న ‘కలియుగ పాండవులు’కు 35 ఏళ్ళు పూర్తి)విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరపై కనిపించిన తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ ఆగస్టు 14తో 35 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. అంటే, హీరోగా వెంకటేశ్ 35 ఏళ్ళు పూర్తి చేసుకున్నారన్న మాట! తొలి చిత్రంతోనే హీరోగా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో డి.రామానాయుడు తమ సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ద్వారాను ఖుష్బూ తెలుగు తెరకు పరిచయం అయ్యారు.…
‘నార్పప్ప’ సినిమా విడుదలైన నేపథ్యంలో సీనియర్ హీరోలు, వారు చేస్తున్న, ఇటీవల చేసిన పాత్రలు మరోసారి ఫిల్మ్ నగర్ వర్గాలలో చర్చకొచ్చాయి. ‘అసురన్’ మూవీలో యంగ్ హీరో ధనుష్ మధ్య వయస్కుడి పాత్రలో ఒదిగిపోయాడు కానీ దాని రీమేక్ గా తెరకెక్కిన ‘నారప్ప’లో వెంకటేశ్ యంగ్ గెటప్ లో మెప్పించలేకపోయాడనే విమర్శలు వచ్చాయి. అందులో యంగ్ నారప్పకు జోడీగా నటించిన అమ్ము అభిరామికి వెంకటేశ్ కు వయసులో ఎంతో వ్యత్యాసం ఉండటం వల్ల ఆ జోడీ జనాలను…
యువ కథానాయకులే కాదు… తన తోటి హీరోలు ఏ సినిమాలో అయినా అద్భుతంగా నటిస్తే వెంటనే స్పందించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల విడుదలైన వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాను చూసి అందులో వెంకటేశ్ నటనకు ఫిదా అయిపోయారు చిరు. దాంతో వెంటనే వెంకటేశ్ ను ఉద్దేశించి ఓ వాయిస్ మెసేజ్ పెట్టారు. దానిని వెంకటేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నటన అంటే ప్రాణం పెట్టే వెంకటేశ్ గర్వపడే చిత్రం ‘నారప్ప’ అని, తనకు సినిమా…