అనిల్ రావిపూడికి ‘ఎఫ్ 3’ టీమ్ బర్త్ డే విషెస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పటాస్’ సినిమాతో రచయిత నుండి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి విజయయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. ఒక చిత్రాన్ని మించిన విజయాన్ని మరో చిత్రంతో అందుకుంటూ ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ దూసుకుపోతున్నాడు. ఈ ఆరేళ్ళలో అనిల్ దర్శకత్వం వహించింది కేవలం ఐదు చిత్రాలే అయినా, తెలుగు సినిమా రంగంలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా అతనికంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల విజయం అతనేమిటో చెప్పకనే చెబుతాయి.
2019, 2020 సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు విడుదలై ఘన విజయం సాధించాయి. అందుకే 2022లో ‘ఎఫ్ 3’ మూవీని సంక్రాంతికి విడుదల చేసి ఆ సీజన్ లో హ్యాట్రిక్ సాధించాలని అనిల్ రావిపూడి అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ కోరిక తీరడంలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ‘ఎఫ్ 3’ మూవీ ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ‘తన సినిమా విడుదల రోజే తనకు పండగ’ అని చెబుతున్న అనిల్ రావిపూడిని ఆ చిత్రం బృందం హాస్యబ్రహ్మ జంధ్యాల, ఆయన శిష్యుడు ఇవీవీ సత్యనారాయణలతో పోల్చుతోంది. అంతేకాదు… అనిల్ రావిపూడికి ఈ చిత్ర బృందంతో పాటు నిర్మాత ‘దిల్’ రాజు సైతం బర్త్ డే విషెస్ తెలిపారు. దానికి సంబంధించిన వీడియోను అనిల్ రావిపూడి బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు.
Also Read
- Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
- Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
- Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!