‘నార్పప్ప’ సినిమా విడుదలైన నేపథ్యంలో సీనియర్ హీరోలు, వారు చేస్తున్న, ఇటీవల చేసిన పాత్రలు మరోసారి ఫిల్మ్ నగర్ వర్గాలలో చర్చకొచ్చాయి. ‘అసురన్’ మూవీలో యంగ్ హీరో ధనుష్ మధ్య వయస్కుడి పాత్రలో ఒదిగిపోయాడు కానీ దాని రీమేక్ గా తెరకెక్కిన ‘నారప్ప’లో వెంకటేశ్ యంగ్ గెటప్ లో మెప్పించలేకపోయాడనే విమర్శలు వచ్చాయి. అందులో యంగ్ నారప్పకు జోడీగా నటించిన అమ్ము అభిరామికి వెంకటేశ్ కు వయసులో ఎంతో వ్యత్యాసం ఉండటం వల్ల ఆ జోడీ జనాలను…
యువ కథానాయకులే కాదు… తన తోటి హీరోలు ఏ సినిమాలో అయినా అద్భుతంగా నటిస్తే వెంటనే స్పందించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల విడుదలైన వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాను చూసి అందులో వెంకటేశ్ నటనకు ఫిదా అయిపోయారు చిరు. దాంతో వెంటనే వెంకటేశ్ ను ఉద్దేశించి ఓ వాయిస్ మెసేజ్ పెట్టారు. దానిని వెంకటేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నటన అంటే ప్రాణం పెట్టే వెంకటేశ్ గర్వపడే చిత్రం ‘నారప్ప’ అని, తనకు సినిమా…
విక్టరీ వెంకటేశ్ తాజా చిత్రం ‘నారప్ప’ ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతటి కష్టాన్నైనా సహించే తండ్రిగా ఆ మధ్య ‘దృశ్యం’లో నటించి మెప్పించిన వెంకటేశ్, ఇప్పుడు తన కొడుకును దక్కించుకోవడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగట్టే తండ్రిగా ‘నారప్ప’లో జీవించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాను వెంకటేశ్ బంధుమిత్రులూ చూసి అభినందనల జల్లు కురిపిస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత ఈ…
విక్టరీ వెంకటేశ్ లేటెస్ట్ మూవీ ‘నారప్ప’కు అన్ని వర్గాల నుండి చక్కని ప్రశంసలు దక్కుతున్నాయి. తమిళ ‘అసురన్’తో పోల్చకుండా చూస్తే… నిజంగానే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా గొప్ప అనుభూతిని కలిగించిందని అందరూ అంటున్నారు. మరీ ముఖ్యంగా వెంకటేశ్ నట జీవితంలో ఇదే ప్రత్యేక చిత్రమని అభినందిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను సినీ ప్రముఖులు సైతం సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. వీరిందరి అభినందనలూ ఒక ఎత్తు అయితే… వెంకటేశ్ మేనల్లుడు నాగచైతన్య భార్య సమంత…
తమిళ ‘అసురన్’కు తెలుగు రీమేక్ ‘నారప్ప’. అక్కడ ధనుష్ కథానాయకుడు కాగా, ఇక్కడ వెంకటేశ్ హీరోగా నటించారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో దగ్గుబాటి సురేశ్ బాబు, కలైపులి ఎస్ థాను దీన్ని నిర్మించారు. మే 14న థియేటర్లలో రిలీజ్ చేయాలని మొదట భావించినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడటంతో తప్పని స్థితిలో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. ‘వి’, ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాలు కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఓటీటీలో…
విక్టరీ వెంకటేశ్, ప్రియమణి కీలక పాత్రలు పోషించిన ‘నారప్ప’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ‘ఈ సినిమాను మే 14న థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకున్నామని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నామ’ని ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన కలైపులి ఎస్. థాను చెప్పారు. 17 సంవత్సరాల క్రితం 2004లో వెంకటేశ్ తో ‘ఘర్షణ’ చిత్రం తెలుగులో తీసిన ఆయన మళ్లీ ఇంతకాలానికి ‘నారప్ప’ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ‘సురేశ్…
విక్టరీ వెంకటేష్ నటించిన ఆసక్తికర భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “నారప్ప”. కొన్ని గంటల్లో డిజిటల్ స్క్రీన్లలోకి రానుంది. ఈ చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుందని మేకర్స్ ప్రకటించారు. తాజా నివేదికల ప్రకారం జూలై 19నే భారతీయ ప్రేక్షకుల కోసం “నారప్ప” అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాత్రి 10 గంటల నుండి ప్రసారం చేయనున్నారు. అంటే రిలీజ్ చేస్తామని ప్రకటించిన దానికంటే ముందే అందుబాటులో ఉంటుంది. యుఎస్ఎ ప్రేక్షకుల కోసం ఈ చిత్రం…
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘నారప్ప’.. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది. కాగా ప్రమోషన్ లో భాగంగా నిర్మాత సురేష్ బాబు నారప్ప విశేషాలు చెప్పుకొచ్చారు. అయితే నారప్ప ఓటీటీ రిలీజ్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపైనా ఆయన కాస్త ఎమోషనల్ అవుతూ క్షమాపణలు కోరాడు. సురేశ్ ప్రొడక్షన్స్లో తీసే చిత్రాలు తన…