ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచే మొదలుకానుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది ఈ నేపథ్యంలో 16వ భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి గత నెల 29న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 19 వరకు నామపత్రాలను స్వీకరిస్తారు. వాటిని 20న పరిశీలిస్తారు. ఉపసంహరణకు తుది గడువు జులై 22. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఆగస్టు 6న నిర్వహిస్తారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హులు. నామినేటెడ్ సభ్యులకూ అర్హత ఉంటుంది.
Punjab: పంజాబ్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా మరో ఐదుగురు ప్రమాణ స్వీకారం
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఒకరికి మించిన అభ్యర్థులు పోటీలో ఉంటే ఆగస్టు 6న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. కొత్తగా ఎన్నికైన ఉప రాష్ట్రపతి ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేస్తారు. ఉప రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోనుంది. 233మంది రాజ్యసభ సభ్యులతో పాటు 12మంది నామినేటెడ్ సభ్యులు, 543మంది లోక్సభ ఎంపీలతో కలుపుకొని మొత్తం 788మంది ఓటుహక్కు వినియోగించుకుంటారు.