రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న పోలీసు వాహనం బోల్తా పడడంతో నలుగురు పోలీసులు గాయపడ్డారు. పాలీ జిల్లాలోని రోహత్, పానిహరి కూడలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ రైడర్‌ను రక్షించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పోలీసు బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కేబినెట్ మంత్రి ఒట్టారామ్ దేవాసి తల్లి ఇటీవల మరణించగా.. ఆయన్ని పరామర్శించడానికి వసుంధర రాజే పాలి జిల్లాలోని బాలికి…
Rajasthan CM: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థుల ఎన్నికలో బీజేపీ అందరిని ఆశ్యర్యానికి చేసింది. ఇప్పటికే ఛత్తీస్గడ్‌కి విష్ణదేవ్ సాయ్, ఎంపీకి మోహన్ యాదవ్‌లను సీఎంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రానికి సీఎంగా కొత్తవారిని ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోందని సమాచారం. ఇక్కడ కూడా బీజేపీ బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శాసనపక్ష నేతను బీజేపీ ఎమ్మె్ల్యేలు ఎన్నుకోబోతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన…
Rajasthan: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తర్వాత ఇప్పుడు అందరి చూపు రాజస్థాన్‌పైనే ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరన్న సస్పెన్స్ ఈరోజు వీడనుంది. ఈ రోజు జరిగే బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి పేరును ఆమోదించనున్నారు.
Rajasthan: రాజస్థాన్‌లో సీఎం పీఠం కోసం పోరు కొనసాగుతోంది. మోడీ హామీ ఎవరికి దక్కుతుందనేదే పెద్ద ప్రశ్న. వసుంధర రాజే తిరిగి వస్తారా లేదా కొత్త వాళ్లకు అవకాశం ఇస్తారా అన్న చర్చ నడుస్తోంది.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించేసింది బీజేపీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 199 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 115 సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో బీజేపీ తరుపున ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజేనే ముఖ్యమంత్రిగా చేస్తారా..? లేకపోతే కొత్తవారిని సీఎం సీటు వరిస్తుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Election Results: రాజస్థాన్ నుంచి తెలంగాణ వరకు ఆదివారం ప్రకటించిన ఎన్నికల ఫలితాలు చాలా మంది నేతలకు భవిష్యత్తుకు కొత్త మార్గాన్ని చూపాయి. కొందరికి దిక్కుతోచని పరిస్థితిగా మారింది.
9.77% voting till 9 am in Rajasthan: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 9.77 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. తొలి 2 గంటల్లో చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత…
India TV-CNX Opinion Poll: 5 రాష్ట్రాల ఎన్నికలకు మరి కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. వచ్చే నెల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరబోతున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో తిరిగి రావచ్చని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ తెలిపింది. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీకి 125 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్ కేవలం 72 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇక…
ఐదు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లోని పార్టీలు ఇప్పటికే జోరుగా ప్రచారం ప్రారంభిస్తున్నాయి. తమ అభ్యర్థుల జాబితాలను పార్టీలు సిద్ధం చేసుకుంటున్నాయి.
రెండు కమిటీల్లోనూ రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నేత వసుంధర రాజే పేరు లేదు. ఇదేంటని బీజేపీని ప్రశ్నించగా.. ప్రతి ఒక్కరికీ ఒక్కో పాత్ర ఇస్తున్నట్లు పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.