శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని అన్నారు.
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జులై 26 వరకు ఎలాంటి సర్వే నిర్వహించవద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. పరిష్కారాల కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని ముస్లిం పిటిషనర్లను ఆదేశించింది.
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే సోమవారం ఉదయం ప్రారంభమవుతుందని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ఆదివారం నాడు ఏఎస్ఐ బృందం కావాల్సిన అన్ని పరికరాలతో వారణాసికి చేరుకుంది.
Varanasi : వారణాసిలో ఓ విదేశీ మహిళ రెచ్చిపోయింది. నగరంలోని మాండూడిహ్ క్రాస్‌రోడ్‌కు దగ్గర రోడ్డుపై ఉన్న జనాలతో అనుచితంగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనం పైకప్పుపై కూర్చుంది.
Mukhtar Ansari: మాఫియా డాన్, రాజకీయవేత్త, గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీని హత్య కేసులో దోషిగా తేల్చింది వారణాసి ఎంపీ ఎమ్మెల్యే కోర్టు. కాంగ్రెస్ నాయకుడిని ఆగస్ట్ 3, 1991లో హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడు అవధేష్ రాయ్ ని వారణాసిలోని అజయ్ రాయ్ ఇంటి బయట కాల్చి చంపారు.
Marriage Cancellation: ఇటీవల కాలంలో పెళ్లి పందిరిలోనే పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిల ప్రవర్తన ఇందుకు కారణం అవుతోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పెళ్లి వేడుకలో వరుడికి షాక్ ఇచ్చింది పెళ్లికూతురు. వివాహ సమయానికి తాగి వచ్చిన వరుడితో పెళ్లికి నో చెప్పింది.
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదులో లభించిన శివలింగానికి శాస్త్రీయ సర్వే, కార్బన్ డేటింగ్ చేయడానికి మే 12న అలహాబాద్ హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై ఇంతేజామియా మసీద్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు శాస్త్రీయ సర్వేను వాయిదా వేయాలని తీర్పు చెప్పింది. ‘‘ఈ విషయంలో మనం జాగ్రత్తగా నడవాలి’’ అని కీలక వ్యాఖ్యలు చేసింది.
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు అంశం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. ఇటీవల హిందూ పక్షం కోరుకున్న విధంగా మసీదులో బయటపడిన శివలింగం వంటి నిర్మాణానికి ‘కార్బన్ డేటింగ్’ పై అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మసీదులోని శివలింగం వయసును కనుగొనేందుకు శాస్త్రీయ పరిశోధన అవసరం హిందూపక్షం న్యాయవాది వాదించారు. దీంతో శివలింగం నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగకుండా కార్బన్ డేటింగ్ కు ఆదేశాలు ఇచ్చింది.
Gyanvapi mosque case:వారణాసిలోని జ్ఞానవాపి మసీదు విషయం గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. స్థానిక కోర్టు ఆదేశాలతో వీడియో రికార్డింగ్ చేస్తున్న సమయంలో మసీదులోని వాజుఖానాలోని కొలనులో ‘శివలింగం’ లాంటి నిర్మాణం లభించింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త దేశంలో చర్చనీయాంశంగా మారింది.
వారణాసిలో గంగా నదీ పుష్కరాల నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల సమ్మేళనం' కాశీ తెలుగు సంగమం' కార్యక్రమం నేడు జరగనుంది. "కాశీ తెలుగు సంగమం" పేరుతో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి.