Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) నివేదిక సంచలనంగా మారింది. ఏఎస్ఐ సర్వేలో మసీదుకు ముందు అక్కడి పెద్ద హిందూ దేవాలయం ఉండేదని తేలింది. వారణాసి కోర్టు ఏఎస్ఐ నివేదికను బహిరంగపరచాలని, ఇరు పక్షాలకు రిపోర్టును అందించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ సర్వేకి చెందిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే సర్వే తర్వాత విశ్వహిందూ పరిషత్(VHP) జ్ఞానవాపి నిర్మాణాన్ని హిందువులకు అప్పగించాలని కోరింది.
Read Also: Uttar Pradesh: పెళ్లి ఆగిపోయిందని.. అమ్మాయి తల్లి, సోదరుడిని హత్య చేసిన వ్యక్తి..
ఈ నివేదిక అందిన రెండు రోజుల తర్వాత విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ జ్ఞాన్వాపి మసీదును మరో ప్రాంతానికి మార్చాలని, జ్ఞాన్‌వాపీ కాంప్లెక్స్ భూమిని కాశీ విశ్వనాథ్ కమిటీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోపల లభించిన శాసనాల్లో జనార్దన, రుద్ర, ఉమేశ్వర వంటి పేర్లు కనుగొనడం దేవాలయం ఉందనే దానికి సాక్ష్యమని అలోక్ కుమార్ అన్నారు. సేకరించిన ఆధారాలతో ఈ ప్రార్థనా స్థలం మతపరమైన స్వభావం ఆగస్టు 15, 1947న ఉనికిలో ఉందని, ప్రస్తుతం హిందూ దేవాలయమని రుజువైందని, అందువల్ల ప్రార్థనా స్థలాల చట్టం 1991లోని సెక్షన్ 4 ప్రకారం నిర్మాణాన్ని హిందూ దేవాలయంగా ప్రకటించాలని అన్నారు.
ఏఎస్ఐ తన నివేదికలో హిందూ దేవీదేవతలకు చెందిన పలు విగ్రహాలను, దేవనాగరి, కన్నడ, తెలుగు శాసనాలను కనుగొన్నారు. పాత మందిర నిర్మాణ స్తంభాలపై మసీదును కట్టినట్లు తేల్చారు. 17వ శతాబ్ధంలో ఔరంగజేబు ఇక్కడి ఆదివిశ్వర ఆలయాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ఏఎస్ఐ నివేదికను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.