Ayodhya Rama: ‘బనారాసి చీరలు’ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. ఈనెల (జనవరి 22న) అయోధ్య రామమందిరాన్ని ప్రారంభం కానుండటంతో.. బనారసీ చీరలకు ఒక్కసారిగా ఆర్డర్లు పెరిగాయి. ఎందుకు అనుకుంటున్నారా. రాముడి బాల్యం నుంచి రావణ సంహారం వరకు బనారసీ చీరలో అన్ని ముఖ్యమైన అంశాలు ముద్రించి వేయాలని నేత కార్మికులకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆర్డర్ ఇచ్చేవారు చీర అంచులపై శ్రీరామ నామాలు ఉండేలా చూడాలన్నారు. ఒక్కో చీర సగటు ధర రూ.7 వేల నుంచి రూ.లక్ష ఉంటుంది. అయితే ఈ చీరను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ తరహా చీరల తయారీకి ఆర్డర్లు వస్తున్నాయని వారణాసిలోని ముబారక్ పూర్ కంపెనీకి చెందిన చేనేత కార్మికుడు అనిసూర్ రెహమాన్ తెలిపారు. జనవరి 22న, ఇలాంటి చీరలు ధరించి, వారి మహిళలు తమ ప్రాంతాల్లో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారని రెహమాన్ తెఇపారు. మరో చేనేత కార్మికుడు మదన్ కంపెనీ మాట్లాడుతూ.. బనారసీ చీర పల్లుపై రామదర్బార్ ఫోటో ఉండాలని అమెరికా నుంచి రెండు ఆర్డర్లు వచ్చాయన్నారు. ఇలాంటి ఆదేశాలతో వారణాసిలో ‘బనారాసి చీరలు’ నేసే చేనేత కార్మికులు చేతినిండా పని వచ్చి ఫుల్ బిజీ అయ్యామని తెలిపారు. రామ మందిరం నిర్మాణం, ప్రారంభం సందర్భంగా చేనేత కార్మికులందరికి చేతినిండా పని ఉందని అన్నారు. ఇదంతా ఆరాముడి లీల అన్నారు.
Read also: CM Revanth Reddy: యశోద ఆస్పత్రిలో సీఎం.. వెంకట్‌రెడ్డిని పరామర్శించిన రేవంత్ రెడ్డి
మరోవైపు ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభం కానుంది. ఈ వేడుక కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ వేడుకలకు దేశం నలుమూలల నుంచి బహుమతులు అందుతున్నాయి. అందులో భాగంగానే తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య రామాలయానికి పంపనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. లక్ష శ్రీవారి లడ్డూలను అయోధ్యకు చేరవేయనున్నారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. తిరుమలలోని పోటులో ఈ లడ్డూలను టీటీడీ ప్రత్యేకంగా తయారు చేస్తోంది. సాధారణంగా తిరుమలలో భక్తులకు విక్రయించే లడ్డూలు 75 గ్రాములు. అయితే అయోధ్యకు వచ్చే భక్తులకు లక్ష లడ్డూలను ఉచితంగా అందించనున్నారు. త్వరలో ఈ లడ్డూలు అయోధ్యకు చేరుకోనున్నాయి. ఇక తెలంగాణ నుంచి అయోధ్య రామ మందిరానికి 118 తలుపులు దారి. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి రామ్‌కి రెండు జతల బంగారు పాదుకలను కూడా రాబోతున్నాయి. హైదరాబాద్ సిటీకి చెందిన అయోధ్య భాగ్య నగర సీతారామ ఫౌండేషన్ దాదాపు రూ. 1.03 కోట్ల విలువైన బంగారు పాదుకలను హైదరాబాద్ నగరానికి చెందిన అయోధ్య భాగ్య నగర సీతారామ ఫౌండేషన్ అందిస్తుంది. కాగా.. ఈ పాదుకలను 25 రోజుల పాటు శ్రమించి శిల్పులు ఎంతో వైవిధ్యంగా రూపొందించారు.
Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు